ETV Bharat / sports

రోహిత్, కుల్​దీప్ ఫన్నీ మూమెంట్- మీమర్స్​కు మంచి స్టఫ్ ఇచ్చారుగా! - rohit kuldeep funny drs

Rohit Sharma Kuldeep: భారత్- ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్​లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ అందర్నీ కాసేపు నవ్వుకునేలా చేసింది. ఇంతకీ ఆ సన్నివేశం ఏంటంటే?

rohit sharma kuldeep yadav
rohit sharma kuldeep yadav
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 6:35 PM IST

Rohit Sharma Kuldeep: క్రికెట్​లో హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్​లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్​లు జరుగుతుంటాయి. సీరియస్​గా మ్యాచ్​ జరుగుతున్నప్పుడు అలాంటి సంఘటనలు నవ్వులు పూయిస్తాయి. విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్​ మూడో రోజు ఆటలో అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. DRS విషయమై కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణ అందర్నీ నవ్వించింది.

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్​లో పేసర్ జస్ర్పీత్ బుమ్రా వేసిన బంతిని స్ట్రైక్​​లో ఉన్న జాక్ క్రాలీ డిఫెన్స్ ఆడబోయాడు. అయితే బంతి అనుకున్న దానికంటే ఎక్కువ స్వింగ్ అయ్యింది. దీంతో బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఒక్కసారిగా టీమ్ఇండియా ప్లేయర్లంతా క్యాచౌట్​కు అప్పీల్ చేశారు. దీంతో అక్కడే ఉన్న కుల్​దీప్ యాదవ్ రీవ్యూ తీసుకోవాల్సిందేనని రోహిత్​ను కోరాడు. బంతి, బ్యాటును తాకిందంటూ కుల్​దీప్ పట్టుపట్టాడు.

నిజంగా తాకిందా అన్నట్లు రోహిత్, కుల్​దీప్ వైపు చూశాడు. కానీ, చాకచక్యంగా వ్యవహరించిన కెప్టెన్ రోహిత్ రివ్యూ కోరలేదు. రిప్లైలో కూడా బంతి, బ్యాటును తాకినట్లు లేదు. దీంతో రోహిత్ 'ఇట్స్ ఓకే' అన్నట్లుగా కుల్​దీప్​ను చూస్తు ఓ నవ్వు నవ్వాడు. అంతే ఈ సన్నివేశం పట్ల అందరూ నవ్వుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఫన్నీ కామెంట్స్​ చేస్తున్నారు. 'కుల్​దీప్ మాట రోహిత్ వినకపోవడమే మంచిదైంది', 'గార్డెన్​పై కాకుండా ఆట మీద దృష్టి పెట్టమని రోహిత్, కుల్​దీప్​కు చెబుతున్నాడేమో' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Ind vs Eng 2nd Test 2024: ఇక మ్యాచ్ విషయానికొస్తే, మూడో రోజు ముగిసేసరికి ఇంగ్లాండ్ ఇంకా 332 పరుగుల వెనుకంజలో ఉంది. సెకండ్ ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 67-1తో ఉంది. జాక్ క్రాలీ (28), రెహాన్ అహ్మద్ (9) క్రీజులో ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్​లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 4, రెహాన్ అహ్మద్ 3, జేమ్స్ అండర్సన్ 2, షోయబ్ బాషిర్ 1 వికెట్ పడగొట్టారు.

భారత్xఇంగ్లాండ్ టెస్టు: డే 3 కంప్లీట్- ఇద్దరికీ నాలుగో రోజే కీలకం

'25 ఏళ్లు కూడా లేని కుర్రాళ్ల 'ఆట' అదుర్స్- క్రికెట్ ప్రపంచాన్ని శాసించేది వీరే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.