ETV Bharat / sports

'ముంబయి కాకపోతే కోల్​కతా కెప్టెన్ అవుతా'!- రోహిత్ షాకింగ్ డెసిషన్- వీడియో వైరల్ - Rohit Sharma KKR IPL - ROHIT SHARMA KKR IPL

Rohit Sharma KKR IPL: ఐపీఎల్​లో ముంబయి కాకపోతే కోల్​కతా జట్టుకు ఆడతానని రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rohit Sharma KKR IPL
Rohit Sharma KKR IPL
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 5:08 PM IST

Updated : Apr 5, 2024, 6:28 PM IST

Rohit Sharma KKR IPL: ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడనున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఐపీఎల్​లో 'ముంబయి కాకపోతే కోల్​కతా నైట్​రైడర్స్ జట్టుకు వెళ్లిపోతా' అని రోహిత్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో ముంబయి ఇండియన్స్​ ఫ్యాన్స్​ కన్​ఫ్యుజన్​కు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

రోహిత్ ఓ పాడ్​కాస్ట్​ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా హిట్​మ్యాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అందులో ముంబయి కాకుండా ఐపీఎల్​లో ఏ జట్టుకు నువ్వు కెప్టెన్ కావాలని అనుకుంటావ్? అని యాంకర్ అడిగింది. దీనికి రోహిత్ ' ఈడెన్ గార్డెన్ నా ఫేవరెట్ గ్రౌండ్. ఆ మైదానం నాకు చాలా కలిసొచ్చింది. అందుకే నేను కేకేఆర్ ఎంచుకుంటా' అని అన్నాడు. అయితే ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది పాత వీడియో. గతంలో రోహిత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక 2025లో రోహిత్ మెగా వేలంలో అందుబాటులో ఉండనున్నాడని ప్రచారం సాగుతోంది. కానీ, ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే!

ఈడెన్​తో రోహిత్ స్పెషల్ బాండిగ్: కోల్​కతా ఈడెన్ గార్డెన్స్​తో రోహిత్ శర్మకు ప్రత్యేక అనుబంధం ఉంది. హిట్​మ్యాన్ వన్డే చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది ఈ మైదానంలోనే. 2014లో శ్రీలంకతో మ్యాచ్​లో రోహిత్ ఏకంగా 264 పరుగులు బాది వరల్డ్​ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈడెన్ వేదికగా టెస్టు క్రికెట్​లో అరంగేట్రం చేసి, తొలి ఇన్నింగ్స్​లోనే 177 పరుగుల స్కోర్ చేశాడు.

ఇక ఐపీఎల్​లో రోహిత్ నమోదు చేసిన ఏకైక సెంచరీ ఈ గ్రౌండ్​లో బాదిందే. 2012లో ఈడెన్​ వేదికగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో రోహిత్ అజేయంగా 109 పరుగులు బాదాడు. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీలో సాధించిన 5 ఐపీఎల్​ టైటిళ్లలో ఒకటి ఈ మైదానంలోనే నెగ్గాడు. 2015 ఐపీఎల్​ ఫైనల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​తో తలపడ్డ ముంబయి 41 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్​లో 26 బంతుల్లో 50 బాదిన రోహిత్​కు మ్యాన్ 'ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది. ఇవేకాకుండా అంతర్జాతీయం టీ20ల్లోనూ రోహిత్ ఈడెన్ వేదికగా అనేక మ్యాచ్​ల్లో రాణించాడు.

అలా జరగడానికి 'ఇది రోహిత్ శర్మ ముంబయి కాదు'- MI హ్యాట్రిక్ ఓటములపై సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - Sehwag On Mumbai Lost

'కెప్టెన్సీ అంటే కాఫీ తాగినంతా ఈజీ కాదు'- హార్దిక్​పై నెటిజన్లు ఫైర్ - Hardik Pandya Captain IPL

Last Updated : Apr 5, 2024, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.