ETV Bharat / sports

'అలా చేసి మళ్లీ పిచ్చి సాకులు చెబుతారు'- ఫీల్డర్లపై రోహిత్ కామెంట్స్ - Rohit Sharma Kapil Sharma Show - ROHIT SHARMA KAPIL SHARMA SHOW

Rohit Sharma Kapil Sharma Show:స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మ మాటలు, చేష్టలు ధనాధన్‌ బ్యాటింగ్‌ వీడియోలు ఇటీవల ఆటోమేటిక్‌గా తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్​గా ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోలో హిట్‌మ్యాన్‌ షేర్‌ చేసుకున్న అంశాలు ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఫీల్డ్‌లో క్యాచ్‌ వదిలేసి సాకులు చెప్పే ప్లేయర్ల గురించి ఏమన్నాడంటే?

Rohit Sharma
Rohit Sharma
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 7:16 PM IST

Rohit Sharma Kapil Sharma Show: టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. హిట్‌మ్యాన్‌ బ్యాటింగే కాదు, మీడియాతో మాట్లాడినా, ఫీల్డ్‌లో ఏదైనా ఫన్నీగా చేసినా అవి వెంటనే వైరల్‌ అయిపోతున్నాయి. రీసెంట్​గా ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఫ్యాన్స్‌ రోహిత్‌కి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. వాస్తవానికి పబ్లిక్‌ అప్పీయరెన్సెస్‌లో అతను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. రోహిత్‌ రిలాక్స్‌డ్‌ అప్రోచ్‌ని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇష్టపడుతారు. తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో రోహిత్‌, శ్రేయాస్‌ అయ్యర్ పాల్గొన్నారు. ఇందులో హిట్‌మ్యాన్ షేర్‌ చేసుకున్న అంశాలతో ఎపిసోడ్‌ సూపర్‌ హిట్‌ అయింది.

షోలో 'పోల్ ఖోల్' సెగ్మెంట్ సందర్భంగా షో హోస్ట్ కపిల్ శర్మ రోహిత్‌ను క్యాచ్‌లు వదిలేసిన తర్వాత కారణాలు చెప్పే ఆటగాళ్ల గురించి అడిగాడు. ఈ ప్రశ్నకు భారత్‌ కెప్టెన్ హిలేరియస్‌ ఆన్సర్లు ఇచ్చాడు. మిస్టేక్స్‌ చేసిన తర్వాత ప్లేయర్‌లు వెర్రి సాకులు చెబుతారని, ఎక్కువ మంది సన్‌లైట్‌ సాకు చూపుతారని అన్నాడు. రోహిత్‌ అక్కడితో ఆగిపోలేదు మరింత చమత్కారంగా 'ఫీల్డింగ్ చేసేటప్పుడు తమ వద్ద సన్‌గ్లాసెస్‌ ఉన్నప్పటికీ అదే (సన్‌లైట్‌ని) సాకుగా చెబుతుంటారు' అని తెలిపాడు.

'మేము చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాం. కాబట్టి అందరూ సాకులు చెబుతారు. మైదానంలో ఎప్పుడూ సన్‌లైట్ ఉంటుంది. ఎండ కారణంగా సన్ గ్లాసెస్ ధరించడం తప్పనిసరి. కానీ, అవి ధరించకుండా వాటిని టోపీ పైన పెట్టుకుంటారు. అలా ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. మళ్లీ సన్‌లైట్‌ కారణంగానే క్యాచ్​ మిస్ అయ్యామని కొందరు సాకులు చెబుతారు. వాళ్లు అలాంటి సాకులు చెప్పినప్పుడు కెప్టెన్‌గా అది ఎంత బాధించేదో నాకు తెలుసు. నేను కూడా అలా ఒకటి రెండు సార్లు చేశాను, ఇట్స్‌ జస్ట్‌ కామన్‌ సెన్స్‌. అయ్యర్ అలా ఎన్నిసార్లు చేశాడు ఇప్పుడు మీకు చెబుతాడు' అని రోహిత్ చెప్పాడు.

రక్షించుకోవడానికి ఓ కారణం కావాలి కదా? అయ్యర్
షోలో రోహిత్‌తో పాటుగా ఉన్న అయ్యర్‌ ఈ విషయంపై భిన్నంగా స్పందించాడు. ఇలా సాకులు చెప్పడానికి గల కారణాల గురించి ప్రశ్నించినప్పుడు, ఫీల్డ్‌లో జరిగిన మిస్టేక్స్‌కి కెప్టెన్ నుంచి రక్షించుకోవడానికి ప్లేయర్‌లు అలాంటి కారణాలు చెబుతారని అన్నాడు.

బుమ్రా@150, రోహిత్@100- ముంబయి x దిల్లీ మ్యాచ్​లో నమోదైన రికార్డులివే - MI vs DC IPL 2024 Match Records

'వాళ్లతో అస్సలు ఉండలేను'- టీమ్ఇండియా ప్లేయర్లపై రోహిత్ కామెంట్స్ - Rohit Sharma Kapil Sharma Show

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.