Rohit Sharma Kapil Sharma Show: క్రికెటర్లు మ్యాచ్‌ల కోసం తరచూ ట్రావెల్ చేస్తుంటారు. ఐపీఎల్, స్వదేశీ టూర్‌లు అయితే ఇండియాలోని సిటీల మధ్య, ఐసీసీ టోర్నీలకు, విదేశీ టూర్‌లకు ఆయా దేశాల మధ్య జర్నీ చేస్తుంటారు. సాధారణంగా హోటల్స్‌లో స్టే చేస్తున్నప్పుడు ఈ మధ్య ప్రతి ప్లేయర్ సెపరేట్ రూమ్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా తోటి ప్లేయర్స్‌తో రూమ్ షేరింగ్ గురించి ది గ్రేట్ ఇండియన్ కపిల్‌షోలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ్ చేసిన ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరితో మాత్రం అస్సలు రూమ్ షేర్ చేసుకోనని హిట్‌మ్యాన్ చెప్పాడు. వాళ్లెవరంటే?
పాపులర్ కమెడిన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఇటీవల రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో కపిల్ 'మీరు టీమ్ ఇండియాలో ఎవరితో రూమ్ షేర్ చేసుకోవాడినికి ఇష్టపడరు' అని రోహిత్‌ని ప్రశ్నించాడు.
హిట్‌మ్యాన్ సమాధానమిస్తూ 'ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ సింగిల్ రూమ్ లభిస్తుంది. కానీ నాకు ఒకే గదిని షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇద్దరు వ్యక్తులతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడను. వాళ్లు శిఖర్ ధావన్, రిషబ్ పంత్. బడే గండే హై (వాళ్లు చాలా మెస్సీగా ఉంటారు). రూమ్‌ను క్లీన్‌గా ఉంచుకోరు. ప్రాక్టీస్ తర్వాత, దుస్తులను అలా మంచం మీదకి విసిరేస్తారు'’ అని చెప్పాడు.
'వారి గది ఎల్లప్పుడూ డూనాట్ డిస్టర్బ్(DND)లో ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట వరకు నిద్రపోతారు. మార్నింగ్ టైమ్‌లో రూమ్ క్లీన్ చేయడానికి హౌస్‌కీపింగ్ సిబ్బంది వస్తారు కాబట్టి, లోపలికి రాకుండా రూమ్స్‌ని DNDలో పెడుతారు. అందుకే వాళ్ల రూమ్స్ మూడు నుంచి నాలుగు రోజులు గజిబిజిగా ఉంటాయి. చుట్టుపక్కల ఉండే వాళ్లకి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి, నేను వారితో ఉండాలనుకోను' అని తెలిపాడు.
అభిమానుల మద్దతు: ఈ షోలో వన్డే ప్రపంచకప్ ఓటమిపై రోహిత్ మాట్లాడాడు. 'అభిమానులు కోపంగా ఉంటారని ఊహించాను. అయితే జట్టుకు లభించిన మద్దతును చూసి ఆశ్చర్యపోయాను. మేము బాగా ఆడామని ప్రశంసించడం, ప్రజలు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పడం గురించి మాత్రమే నేను విన్నాను' అని పేర్కొన్నాడు.
ఐపీఎల్లో రోహిత్ మరో ఘనత- దిల్లీపై క్రేజీ రికార్డ్ - Rohit Sharma IPL Record
వాంఖడేలో 'ముంబయి' విధ్వంసం- దిల్లీ ముందు భారీ టార్గెట్ - MI vs DC IPL 2024