Rohit Sharma vs Mitchell Starc: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024 టీ20 వరల్డ్‌కప్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రోహిత్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఇందులో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో 5 సిక్స్‌లు బాదాడు. ఇది మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దీంతో స్టార్క్‌పై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. కాగా, ఈ ట్రోల్స్ ఇప్పుడు అమెరికా దాకా వెళ్లాయి.
డాలస్‌లో ఓ స్పోర్ట్స్ అకాడమీ ప్రారభించడానికి రోహిత్ రీసెంట్గా అమెరికా వెళ్లాడు. ఈ ఓపెనింగ్ ఈవెంట్లో రోహిత్ స్టేజ్‌పై మాట్లాడుతుండగా అక్కడున్న ఫ్యాన్స్ 'మిచెల్ స్టార్క్, మిచెల్ స్టార్క్' అంటూ ఆసీస్ పేసర్‌ను ఓ లెవల్లో ర్యాగింగ్ చేశారు. దీంతో రోహిత్ నవ్వతూ 'కామ్ డౌన్ గాయ్స్' అని ఆన్సర్ ఇచ్చాడు. అంతే ఒక్కసారిగా ఈవెంట్లో నవ్వులే నవ్వులు. కాగా, ఆ మ్యాచ్‌లో రోహిత్ 41 బంతుల్లోనే 92 పరుగులు బాది ఆసీస్ బౌలర్లనుతో ఊచకోత కోశాడు. ఇందులో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్లో 29 పరుగులు బాదాడు. ఇక ఈ టోర్నీలో రోహిత్ 257 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
At least you will see me playing for a while! Says Rohit Sharma in Dallas. pic.twitter.com/wADSJZj6b5
— Vimal कुमार (@Vimalwa) July 14, 2024
Rohit Sharma Retirement: ఇక తన రిటైర్మెంట్పై వస్తున్న ప్రచారానికి కూడా ఇదే ఈవెంట్లో చెక్ పెట్టాడు. ఇప్పటికే తన రిటైర్మెంట్పై పలుమార్లు క్లారిటీ ఇచ్చిన రోహిత్ తాజాగా మరోసారి స్పందించాడు. తనకు ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదని, అంత దూరం ఆలోచించలేదని రోహిత్ అన్నాడు. అమెరికాలో ఓ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభానికి వెళ్లిన రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన లేదు. నిజానికి నేను అంత దూరం కూడా ఆలోచించలేదు. నేను ఇంకొంత కాలం ఆడతాను' అని అక్కడి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ సందడి చేశారు. కాగా రీసెంట్గా టీ20 వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
Rohit Sharma was gone to the event of his new cric academy in us then:
— Prathmesh. (@45Fan_Prathmesh) July 14, 2024
Crowd : " mitchell starc, m. starc !
rohit sharma: calm down guys.😭
us crowd trolling starc for that 29 runs over.🤣🔥pic.twitter.com/jV0FxVzf5t
ఆసీస్‌పై రోహిత్ దండయాత్ర- సిక్సర్లతో హిట్‌మ్యాన్ విధ్వంసం - T20 World Cup
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ - తొలి కెప్టెన్‌గా సూపర్ రికార్డ్! - T20 Worldcup 2024 Rohith Sharma