ETV Bharat / sports

వన్డేల్లో హిట్​మ్యాన్ వరల్డ్​ రికార్డ్ - పదేళ్లైనా ఇంకా చెరగలేదు - Rohit Sharma Birthday

Rohit Sharma Birthday Special : టీమ్​ఇండియాకు సచిన్​, సెహ్వాగ్​ వంటి దిగ్గజాలు ఓపెనర్లుగా ఏళ్ల పాటు సేవలందించారు. వారిద్దరూ రిటైర్మెంట్​కు దగ్గర పడుతున్న సమయంలో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలా? అని ఆలోచిస్తున్న మేనేజ్​మెంట్​కు కరెక్ట్​గా దొరికాడు రోహిత్ శర్మ. 2013 ఛాంపియన్స్​ ట్రోఫీలో ఓపెనర్​గా ప్రారంభమైన తన కొత్త ప్రయాణంతో, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడి, హిట్​మ్యాన్​గా పేరు తెచ్చుకున్నాడు. పరిమిత ఓవర్ల జట్టుకు వైస్​కెప్టెన్​గానూ బాధ్యతలు అందుకున్నాడు. హిట్​మ్యాన్​ నేడు 37 వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడి గురించి ప్రత్యేక కథనం.

Rohit Sharma Birthday Special
Rohit Sharma Birthday Special
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 9:53 AM IST

Rohit Sharma Birthday Special : అతను జట్టు గెలుపుకోసం ముందుండి పోరాడుతాడు, ఆటోమేటిక్‌గా రికార్డులు అతని వెంట నడుస్తాయి. తనదైన రోజున సిక్సుల వర్షంతో వీక్షకులను ఫీల్డర్లుగా, ఫీల్డర్‌లను వీక్షకులుగా మార్చేస్తాడు. అటు సీనియర్‌లకు, ఇటు జూనియర్‌లకు, అందరి అభిమానులకు మోస్ట్‌ లవబుల్‌ ప్లేయర్‌. మీరు ఊహించింది నిజమే మనం మాట్లాడుకుంటోంది భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించే. ఈ ఏప్రిల్‌ 30న హిట్‌మ్యాన్‌ 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. రో పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్‌లోని అద్భుత విజయాలు, ఆసక్తికర అంశాలు పరిశీలిద్దాం.

ప్రస్తుత జనరేషన్‌లోని అత్యుత్తము బ్యాటర్‌లలో రోహిత్ శర్మ ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇండియాకి మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2023లో వన్డే వరల్డ్‌ కప్‌ తృటిలో చేజార్చుకున్న రోహిత్, ఇప్పుడు 2024 టీ20 వరల్డ్‌ కప్‌ వేటకు సిద్ధమవుతున్నాడు.

2007లో రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సంవత్సరం ఐసీసీ T20 వరల్డ్ కప్ 2007లో రోహిత్ పెర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 16 బంతుల్లో 30* పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అప్పటి నుంచే విధ్వంసక యంగ్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో మొదటి ఆరేళ్ల పాటు మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేశాడు. అయితే 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటిసారి శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి రోహిత్‌ కెరీర్‌ గ్రాఫ్‌ అమాంతం పైకి లేచింది. ఐదు ఇన్నింగ్స్‌లలో 35.40 యావరేజ్‌తో 177 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఓనెనర్‌గా మారిన తర్వాత రోహిత్‌ దూకుడు పెరిగింది. హిట్‌మ్యాన్‌ అనే బిరుదును పొందాడంటే అతని విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రోహిత్‌ 262 వన్డేల్లో 49.12 యావరేజ్‌తో 10709 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు, 55 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 264. వన్డే క్రికెట్‌ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోరు. విరాట్ (50), సచిన్ (49) తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేశాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ(3) డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ రోహిత్.

ధోని (10599), రాహుల్ ద్రవిడ్ (10,768), సౌరవ్ గంగూలీ (11,221), విరాట్ కోహ్లి (13848), సచిన్ తెందూల్కర్ (18426) తర్వాత వన్డే క్రికెట్‌లో ఇండియన్‌ ప్లేయర్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడు. మొత్తంగా చూస్తే ప్రపంచంలో 15వ స్థానంలో ఉన్నాడు. నమ్మదగిన టెస్ట్ ఓపెనర్‌గా కూడా రోహిత్‌ నిలిచాడు. 59 మ్యాచ్‌లు, 101 ఇన్నింగ్స్‌లలో, 45.46 యావరేజ్‌తో 57.05 స్ట్రైక్ రేట్‌తో 4137 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌
ఐపీఎల్‌లో రోహిత్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా నిలిచాడు. ముంబయి సారథిగా ఐదు ట్రోఫీలు గెలిచాడు. అత్యధిక టైటిల్స్‌ గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. రోహిత్‌ సారథ్యంలో (2013, 2015, 2017, 2019, 2020)లో ముంబయి కప్పు గెలిచింది. డెక్కన్ ఛార్జర్స్‌తో 2009లో కప్పు గెలిచినప్పుడు రోహిత్‌ జట్టులో కీలక సభ్యుడు.

లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో బ్యాటర్‌. 252 మ్యాచ్‌లు, 247 ఇన్నింగ్స్‌లలో 29.92 యావరేజ్‌తో 6522 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 42 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రోహిత్‌ అత్యుత్తమ స్కోరు 109*. ఐపీఎల్‌ 2024లో ముంబయి ఇండియన్స్‌లో బ్యాటర్‌గా ఆడుతున్నాడు.

నెక్స్ట్‌ టార్గెట్‌ అదే!
2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ 597 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ తన లక్ష్యమని, మరో వన్డే వరల్డ్‌ కప్‌ ఆడాలని ఉందని తాజాగా రోహిత్‌ తన మనసులో మాట బయటపెట్టాడు. రోహిత్ తన ఫామ్‌ కొనసాగించాలని, ఇండియాకి వరల్డ్‌ కప్‌లు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రోహిత్ ఖాతాలో పలు రికార్డులు- ఆ లిస్ట్​లో టాప్​లోకి హిట్​మ్యాన్ - IPL 2024

ఐపీఎల్​లో ఆ రూల్​ నాకు నచ్చలేదు - దాని వల్ల నష్టం : రోహిత్ శర్మ - IPL 2024 Rohith Sharma

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.