ETV Bharat / sports

ఆకాశ్​ కారులో రోహిత్! - హిట్​మ్యాన్​ కోసం ఆ ఫ్రాంచైజీ రెడీ! - Rohit Sharma Mumbai Indians - ROHIT SHARMA MUMBAI INDIANS

Rohit Sharma Mumbai Indians : ఐపీఎల్​ పోరు కోసం ముంబయి జట్టు సిద్ధమవుతున్న తరుణంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇటీవలే ముంబయి ఫ్రాంచైజీ కో ఓనర్ ఆకాశ్ అంబానీతో పాటు కారులో ప్రయాణిస్తూ కనిపించాడు.

Rohit Sharma Mumbai Indians
Rohit Sharma Mumbai Indians
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 9:44 AM IST

Rohit Sharma Mumbai Indians : ఐపీఎల్​ పోరు కోసం ముంబయి జట్టు సిద్ధమవుతున్న తరుణంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇటీవలే ముంబయి ఫ్రాంచైజీ కో ఓనర్ ఆకాశ్ అంబానీతో పాటు కారులో ప్రయాణిస్తూ కనిపించాడు. వాంఖడే స్టేడియం వైపు వెళ్తున్న వారిద్దని చూసేందుకు రోహిత్ ఫ్యాన్స్ ఆతృతగా ముందుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

అయితే రోహిత్ ఆకాశ్ కారులో ఎందుకు వెళ్లారన్న విషయం గురించి ఫ్యాన్స్ నెట్టింట తెగ చర్చిస్తున్నారు. ఫ్రాంచైజీకి సంబంధించిన కీలక విషయాల గురించి మాట్లాడటానికి అయ్యుండచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొదరేమో గత మ్యాచ్​ల గురించి రోహిత్​తో ఆయన డిస్కస్ చేస్తున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

రోహిత్​కు ఓకే అయితే మేము రెడీ!
ఇదిలా ఉండగా, 2025లో జరిగే మెగా వేలంలో రోహిత్‌ ముంబయిని వీడనున్నాడని ప్రచారం జరుగుతోంది. రోహిత్‌ ఈ వేలంలోకి వస్తే అతడ్ని తీసుకుని కెప్టెన్‌ను చేయాలని చాలా ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లఖ్​నవూ సూపర్ జెయింట్స్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ రోహిత్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ముంబయి ఇండియన్స్ ఒప్పుకుంటే తాము తమ జట్టులోకి రోహిత్‌ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ లాంగర్ పేర్కొన్నాడు.

'ఓ ప్లేయర్​ను జట్టులోకి తీసుకురావాలని అనుకుంటే, నేను ఎవరి గురించి ఆలోచిస్తానని అనుకుంటున్నారు?' అంటూ యాంకర్​ను జస్టిన్ లాంగర్ అడిగాడు. దానికి ఆ వ్యక్తి 'లఖ్​నవూ సూపర్ జెయింట్స్‌లో అన్ని విభాగాలు పటిష్టంగానే ఉన్నాయి. అయితే రోహిత్ శర్మను తీసుకురావాలని చూస్తున్నారా?' అంటూ రిప్లై ఇవ్వగా, 'రోహిత్ శర్మ? ముంబయి ఇండియన్స్ నుంచి తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీరు మా కోసం ఫ్రాంచైజీతో మాట్లాడండి' అంటూ సరదాగా అన్నారు.

ఇక వాంఖడే వేదికగా జరగనున్న ఆర్సీబీ, ముంబయి ఇండియ్స్​ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఒక జట్టు ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓటమి చవిచూడగా, మరో జట్టు హ్యాట్రిక్‌ పరాజయాలతో టోర్నీని మొదలు పెట్టి ఓ విజయం సాధించింది. దీంతో ఈ పోరుపై అందరినీ ఆసక్తి నెలకొంది.

2025 IPL మెగా వేలం- ఫ్రాంచైజీ ఓనర్స్​ మీటింగ్ వాయిదా - Ipl 2025 Mega Auction

10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం​ IPL నుంచి ముంబయి బౌలర్ ఔట్ - ఇదేం రీజన్ రా బాబు! - Kwena Maphaka IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.