Rohan Bopanna Australia Open : భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తాజాగా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విభాగంలో తన సహచరుడు ఎబ్డెన్‌తో కలిసి ఫైనల్‌లో ఇటలీ జోడీ సిమోన్-వావాసోరిపై విజయాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను బోపన్న తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్‌లో 7-6 (7/0), 7-5 తేడాతో వరుస సెట్లలో రోహన్ జోడీ విజయం సాధించింది. అలా 43 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.
-
Look what it means to @rohanbopanna and @mattebden 😍
— #AusOpen (@AustralianOpen) January 27, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
At 43, Bopanna has his FIRST Men's Doubles Grand Slam title - and becomes the oldest to do so in the Open Era 👏👏#AusOpen pic.twitter.com/qs0JlrkMO7
">Look what it means to @rohanbopanna and @mattebden 😍
— #AusOpen (@AustralianOpen) January 27, 2024
At 43, Bopanna has his FIRST Men's Doubles Grand Slam title - and becomes the oldest to do so in the Open Era 👏👏#AusOpen pic.twitter.com/qs0JlrkMO7Look what it means to @rohanbopanna and @mattebden 😍
— #AusOpen (@AustralianOpen) January 27, 2024
At 43, Bopanna has his FIRST Men's Doubles Grand Slam title - and becomes the oldest to do so in the Open Era 👏👏#AusOpen pic.twitter.com/qs0JlrkMO7
మ్యాచ్ ఎలా సాగిందంటే ?
Australia Open Mixed Double 2024 : ఫైనల్‌లో సిమోన్ - వావాసోరి జోడీ నుంచి రోహన్ - ఎబ్డెన్‌కు గట్టి పోటీ ఎదురైంది. తొలి పాయింట్ నుంచి ఇరు టీమ్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి సెట్‌ను 7-6 (7/0)తో రోహన్ జోడీ తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే రెండో సెట్ కాస్త మరింత రసవత్తరంగా సాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా? అంటూ గెలుపు కోసం తీవ్రంగా పోరాడారు. ఒకానొక సమయంలో రోహన్ బోపన్న జోడీ 3-4తో వెనకబడింది. అయినప్పటికీ క్రమక్రమంగా వేగం పుంజుకుని దూసుకెళ్లింది. దీంతో మ్యాచ్ రిజల్ట్ మూడో సెట్‌కు వెళ్తుందా? అనే అనుమానం సైతం వీక్షకులకు వచ్చింది. కానీ, రోహన్ - ఎబ్డెన్ జోడీ అదరగొట్టేసింది. రెండో సెట్‌ను 7-5 తేడాతో నెగ్గి, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Rohan Bopanna Padma Award : ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బోపన్నకు 'పద్మ' పురస్కారం ప్రకటించింది. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్న రోహన్ బోపన్న 2017లో మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా చరిత్రకెక్కాడు. పురుషుల విభాగంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత గ్రాండ్‌స్లామ్ నెగ్గిన మూడో భారత ఆటగాడు రోహన్ బోపన్న రికార్డుకెక్కాడు. మహిళల విభాగంలో సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గింది. దాదాపు 60 సార్లు గ్రాండ్‌స్లామ్స్‌లో పోటీపడగా, తొలిసారి ఇప్పుడు రోహన్ విజేతగా నిలిచాడు. ఇది కూడా ఒక రికార్డు కావడం విశేషం.
క్రీడా రంగంలో విరిసిన 'పద్మాలు' - బోపన్నతో పాటు ఆరుగురికి
టెన్నిస్ హిస్టరీలో బోపన్న రికార్డు - 43 ఏళ్ల వయసులో నంబర్ వన్ ప్లేయర్