Rishabh Pant 90s In Test : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే పంత్, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించాడు. కానీ, 99 వ్యక్తిగత పరుగుల వద్ద పంత్ ఓ రూర్కీ బౌలింగ్‌లో క్యాచౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో తృటిలో శతకం చేజార్చుకున్నాడు. పంత్ ఔట్ అవ్వడం వల్ల ఒక్కసారిగా టీమ్ఇండియా ఫ్యాన్స్ నిరాశ చెందారు.
అయితే టెస్టు క్రికెట్లో 90'ల్లో పెవిలియన్ చేరడం పంత్‌కు ఇది తొలిసారి కాదు. 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన పంత్, ఇప్పటివరకు 62 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగాడు. ఇందులో 90ల్లో ఔట్ అవ్వడం పంత్‌కు ఇది ఏడోసారి. పంత్ ఇప్పటివరకు 93, 97, 96, 92, 92, 91, 99 స్కోర్ల వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక సార్లు 90ల్లో ఔటైన భారత ఆటగాళ్లలో మూడో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజం సచిన్ తెందూల్కర్ అందరికంటే ఎక్కువగా 10సార్లు 90ల్లో పెవిలియన్ చేరాడు.
టెస్టుల్లో 90ల్లో అత్యధికసార్లు ఔటైన టీమ్ఇండియా ప్లేయర్లు
సచిన్ తెందూల్కర్ | 10 |
రాహుల్ ద్రవిడ్ | 09 |
రిషభ్ పంత్ | 07 |
సునీల్ గావస్కర్ | 05 |
ఎమ్ ఎస్ ధోనీ | 05 |
వీరేంద్ర సెహ్వాగ్ | 05 |
రెండో బ్యాటర్‌గానూ
అయితే పంత్ ఈ మ్యాచ్‌తో 99 పరుగుల వద్ద ఔటైన టీమ్ఇండియా రెండో వికెట్ కీపర్‌గానూ నిలిచాడు. పంత్ కంటే ముందు మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ 99 పరుగుల ఔటై, పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో సింగిల్ రన్‌తో సెంచరీ చేజార్చుకున్న నాలుగో వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.
THE MOST HEARTBREAKING PICTURE OF THE DAY. 🥹💔
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2024
Rishabh Pant batted so well, even after struggling due to knee issues, he entertained like he does every time. 7th score in the 90s for Pant in Tests. 💔 pic.twitter.com/ZNzGZDZFCa
99 పరుగుల వద్ద ఔటైన వికెట్ కీపర్లు
- బ్రెండన్ మెక్కల్లమ్ (న్యూజిలాండ్) vs శ్రీలంక- 2025
- ఎమ్ఎస్ ధోనీ (భారత్) vs ఇంగ్లాండ్ - 2012
- జానీ బెయిర్ స్టో (ఇంగ్లాండ్) vs సౌతాఫ్రికా - 2017
- రిషభ్ పంత్ (భారత్) vs న్యూజిలాండ్ -2024
కాగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ (150 పరుగులు), పంత్ (99 పరుగులు), విరాట్ కోహ్లీ (70 పరుగులు), రోహిత్ శర్మ (52 పరుగులు) రాణించారు. దీంతో టీమ్ఇండియా 106 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
తొలి సెంచరీతోనే అరుదైన క్లబ్లో సర్ఫరాజ్- దిగ్గజాల సరసన చోటు