Rishabh Pant Border Gavaskar Trophy : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఓ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లోని ఓ క్యాచ్ పట్టడం ద్వారా టెస్టుల్లో 150 డిస్‌మిస్సల్స్ మార్క్‌ను తాకిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ప్రస్తుతం తన కెరీర్‌లో 41వ టెస్టు మ్యాచ్ ఆడుతోన్న పంత్, ఇప్పటి వరకు 135 క్యాచ్‌లు పట్టాడు. దీంతో పాటు 15 స్టంపింగ్స్ చేశాడు.
అయితే ఈ లిస్ట్‌లో పంత్ భారత్ తరఫున మూడో వికెట్ కీపర్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు. అందరి కంటేముందే 'కెప్టెన్ కూల్' మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. అతడు 294 డిస్‌మిస్సల్స్‌లో భాగస్వామిగా ఉండి ఇంకా ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత సయ్యద్ కిర్మాణి (198) రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
మ్యాచ్ సాగిందిలా :
ఓవర్‌నైట్ 28/0 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన వరుస ఓవర్లలో ఆస్ట్రేలియా ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చాడు. ఆఫ్ వికెట్‌కు వేసిన బంతిని ఆడబోయిన ఉస్మాన్ ఖవాజా (21) వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు దొరికాడు. దీంతో టెస్టుల్లో 150 డిస్‌మిస్సల్స్‌లో భాగస్వామిగా పంత్ రికార్డుకెక్కాడు. ఆ తర్వాత మెక్‌స్వీనీని కూడా బుమ్రా పెవిలియన్ బాట పట్టించాడు. స్లిప్‌లో విరాట్‌కు క్యాచ్ ఇచ్చి మెక్‌స్వీనీ (9) డగౌట్‌కు చేరాడు. అనంతరం స్టీవ్ స్మిత్‌తో కలిసిన మార్నస్ లబుషేన్ (12: 55 బంతుల్లో) క్రీజ్‌లో పాతుకుపోయేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలో అతడు ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చాడు. అయితే, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి వేసిన ఆఫ్‌సైడ్ బాల్‌కు లబుషేన్ దొరికిపోయాడు. స్లిప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఈ సెషన్‌లో ఆస్ట్రేలియా 29.4 ఓవర్లలో కేవలం 76 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఓవర్ మధ్యలో కాస్త ఇబ్బంది పడిన సిరాజ్ వైద్య చికిత్స చేయించుకొనేందుకు డగౌట్ చేరుకున్నాడు. మళ్లీ కాసేపటికే ఫీల్డింగ్‌కు వచ్చేశాడు.
'తన వ్యాల్యు టెస్ట్ చేసుకోవాలనుకున్నాడు- అందుకే వేలంలోకి పంత్'
టీమ్ఇండియా రిచెస్ట్ క్రికెటర్‌గా పంత్ - కోహ్లీ, రోహిత్‌ను వెనక్కినెట్టి! - సంపాదనో ఎంతంటే?