ETV Bharat / sports

గంభీర్ కామెంట్స్​కు పాంటింగ్ రిప్లై- అతడి బాధ అది కాదంట!

గంభీర్ వ్యాఖ్యలపై పాంటింగ్ రియాక్షన్- కోచ్ కామెంట్స్ ఆశ్చర్యం కలిగించాయట!

Ponting vs Gambhir
Ponting vs Gambhir (Source : AP (Left), Getty Images (Right)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 12:40 PM IST

Ricky Ponting On Gautam Gambhir : బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత జట్టు ఇటీవల ఆస్ట్రేలియా బయల్దేరింది. ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ ఆడనుంది. నవంబర్ 22న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ప్లేయర్ టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్​పై ఆందోళన వ్యక్తం చేయగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రీసెంట్​గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అయితే గంభీర్ వ్యాఖ్యలపై పాంటింగ్ స్పందించాడు. విరాట్​ను అపహాస్యం చేసేందుకు విమర్శించలేదని తాజాగా వెల్లడించాడు.

'విరాట్ టాప్​ క్లాస్‌ క్రికెటర్. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్. అయితే అతడి ఫామ్‌పై నేను ఇటీవల ఆందోళన వ్యక్తం చేశా. ఈ మాట విరాట్‌ను అడిగినా, అతడు కూడా అదే సమాధానం చెబుతాడు. అంతకుముందు కెరీర్​లో సెంచరీల మీద సెంచరీలు బాదిన విరాట్ కొంతకాలంగా ఆ స్థాయిలో ఆడలేకపోతున్నాడు. ఇది ఏ మాత్రం అతడిని కించపరిచినట్లు కాదు. గతంలో ఆస్ట్రేలియాలో అతడు చాలా అద్భుతంగా ఆడాడు. తప్పకుండా మరోసారి చెలరేగేందుకు అవకాశం ఉంది. అయితే గంభీర్‌ కామెంట్స్​కు నేను షాక్ అయ్యేవాడిని కాదు. కానీ, కోచ్‌ స్థాయిలో ఉంటూ అతడు స్పందించిన విధానమే నన్ను సర్‌ప్రైజ్‌ చేసింది' అని పాంటింగ్ అన్నాడు.

చుక్కలు చూపిస్తాడు
విరాట్ కోహ్లీపై పాంటింగ్ చేసిన కామెంట్స్​ను ఆసీస్ మాజీ ప్లేయర్​ షేన్‌ లీ కూడా తప్పుబట్టాడు. ప్రతిష్ఠాత్మకమైన సిరీస్ ముందు ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదన్నాడు. 'రికీ పాంటింగ్‌ నువ్వు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరైనవి కావు. వరల్డ్ టాప్ క్లాస్ ప్లేయర్​లో ఒకరైన విరాట్​ని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదు. అతడు ఒక్కసారి కుదురుకుంటే ఆసీస్‌కు మళ్లీ చుక్కలు చూపిస్తాడు' అని షేన్ లీ పేర్కొన్నాడు.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సిరాజ్, ఆకాశ్‌ దీప్, ప్రసిధ్‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. రిజర్వ్: ముకేశ్‌ కుమార్, నవ్‌దీప్‌ సైని, ఖలీల్ అహ్మద్

'టీమ్ఇండియా​తో పాంటింగ్​కు ఏం సంబంధం? ఎవరి పని వాళ్లు చూసుకుంటే బెటర్!'

'గంభీర్‌ను ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లకు పంపొద్దు' - బీసీసీఐకి మాజీ క్రికెటర్ స్పెషల్ రిక్వెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.