ETV Bharat / sports

భారత జట్టు నుంచి స్టార్ వికెట్ కీపర్ ఔట్​! - ఇంటర్ పరీక్షల కోసం వన్డే సిరీస్​కు దూరం!

వన్డే సిరీస్​కు మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్​ దూరం! - ఇంటర్ పరీక్షలే కారణమా?

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Richa Ghosh ODI Series
Richa Ghosh (Associated Press)

Richa Ghosh ODI Series : న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్​లో భాగంగా భారత మహిళల జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అయితే ఈ టీమ్​లో స్టార్ వికెట్ కీపర్ రిచా ఘోష్ పేరు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఆమె త్వరలో జరగనున్న ఇంటర్ సెకెండ్ ఇయర్ (12వ క్లాస్) పరీక్షల కోసం వెళ్లనున్నట్లు సమాచారం. దీని కారణంగా ఈ కివీస్ సిరీస్‌కు రిచా దూరమవ్వనుందట.

హర్మన్ సారథ్యంలోనే
పాకిస్థాన్, శ్రీలంకపై గెలిచిన భారత మహిళల జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై సెమీఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో టోర్నీ తర్వాత కెప్టెన్ హర్మన్​ప్రీత్​పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమె స్థానంలో మరోక సారథిని నియమించాలన్న డిమాండ్లు సైతం వినిపించాయి. అంతేకాకుండా వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టును తీర్చిదిద్దాలన్న సూచనలు కూడా వచ్చాయి.

ఇదిలా ఉండగా, హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ భవితవ్యంపై సెలక్షన్ కమిటీ, కోచ్‌తో బీసీసీఐ ప్రత్యేక సమావేశం కానుందంటూ వార్తలు రాగా, హర్మనే రానున్న మ్యాచ్​లకు సారథిగా కొనసాగుతుందంటూ బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కొందరు ప్లేయర్లు దూరం కావడం వల్ల ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు సైమా ఠాకూర్, సయాలీ సత్‌ఘరే, మిడిలార్డర్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్‌ లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యారు.

న్యూజిలాండ్ సిరీస్ కోసం ఎంపికైన భారత మహిళల జట్టు ఇదే :
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), షెఫాలి వర్మ, హేమలత, దీప్తిశర్మ, జెమీమా, యాస్తిక, ఉమ ఛెత్రి, సయాలి, స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), అరుంధతి రెడ్డి, రేణుక, తేజల్, సైమా థాకూర్, ప్రియ మిశ్రా, రాధ, శ్రేయంక పాటిల్‌.

గ్రూప్​ ఏ సెమీస్ బెర్తులు వీరిదే - కాగా, మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో గ్రూప్‌ - ఏ నుంచి ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచులు ఆడి నాలుగింటిలోనూ విజయం సాధించింది. కివీస్ జట్టు నాలుగు మ్యాచులు ఆడి మూడింటిలో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఆడిన నాలుగు మ్యాచులలో రెండు గెలిచిన భారత్ జట్టు ఇంటిదారి పట్టింది. పాకిస్థాన్​ ఒక విజయం మాత్రమే సాధించి నిష్క్రమించింది. శ్రీలంక అన్ని మ్యాచులలోనూ పరాజయం పొందింది. గ్రూప్‌ - బీలో ఇంకా సెమీస్ బెర్త్‌లు ఖరారు అవ్వలేదు.

T20 వరల్డ్​కప్ థీమ్ సాంగ్ రిలీజ్- మీరు విన్నారా? - 2024 Womens T20 World Cup

మహిళల టీ20 ప్రపంచ కప్‌ - పాక్‌ ఓటమి, భారత్‌ ఇంటికి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.