ETV Bharat / sports

పంజాబ్​కు ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు​ - ఆర్సీబీ నాలుగో విక్టరీ - IPL 2024 - IPL 2024

RCB VS PBKS IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది.

RCB VS PBKS IPL 2024
RCB VS PBKS IPL 2024 (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 11:00 PM IST

Updated : May 10, 2024, 6:25 AM IST

RCB VS PBKS IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే పైచేయిగా నిలిచింది. దూకుడుగా ఆడి తమ ఖాతాలో నాలుగో విజయాన్ని వేసుకుంది. దీంతో 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైంది.

మ్యాచ్ సాగిందిలా :
టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (92), తన పరుగులతో జట్టుకు కీలక స్కోర్ అందించగా, రజత్ పటిదార్‌ (55), కూడా అర్థశతకం దాటి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖరిలో వచ్చిన చివర్లో కామెరూన్ గ్రీన్ (46) తన ఇన్నింగ్స్​లో మంచి పెర్ఫామెన్స్ చూపించాడు. దినేశ్ కార్తిక్ (18), డుప్లెసిస్ (9), విల్ జాక్స్‌ (12) మాత్రం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇక పంజాబ్ బౌలర్ హర్షల్ పటేల్ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో మూడే పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. విధ్వత్ కావేరప్ప 2, అర్ష్‌దీప్, సామ్ కరన్‌ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. వర్షం కారణంగా మ్యాచ్​కు కాసేపు అంతరాయం కలిగినప్పటికీ, కొద్ది సేపటికే మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.

ఇక బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ జట్టు విఫలమైంది . తొలి ఓవర్లోనే ప్రభ్‌సిమ్రన్‌ (6) ఔటైనప్పటికీ బెయిర్‌స్టో (27), రొసో ఆ జట్టును కొంతమేర ఆదుకున్నారు. లోమ్రార్‌ క్యాచ్‌ వదిలేయడం వల్ల బతికిపోయిన రొసో ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. బెయిర్‌స్టో వెనుదిరిగినప్పిటికీ రొసో తన బాదుడు కొనసాగించాడు. కానీ ఆర్సీబీ స్పిన్నర్లు పంజాబ్‌ జోరుకు కళ్లెం వేశారు. కర్ణ్‌ వరుస ఓవర్లలో రొసో, జితేశ్‌ (5)ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన లివింగ్‌స్టన్‌ (0) కూడా ఒక్క పరుగు చేయకుండానే వెనుతిరిగాడు. దీంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. చివరి వరకూ పోరాడేలా కనిపించినప్పటికీ శశాంక్‌ (37), కోహ్లి తీసిన వికెట్​కు ఔటవ్వక తప్పలేదు. వెంటనే వచ్చిన అశుతోష్‌ కూడా (8) పెవిలియన్ చేరుకోవడం వల్ల పంజాబ్ కొద్దిసేపటికే ఆలౌటైపోయింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు కూడా వదులుకోవాల్సి వచ్చింది.

బెంగళూరు తుది జట్టు : రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్‌, మహిపాల్ లామ్రోర్, కామెరూన్ గ్రీన్, స్వప్నిల్ సింగ్, దినేశ్ కార్తిక్, కర్ణ్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్, ఫెర్గూసన్.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు : విజయ్‌కుమార్‌ వైశాఖ్‌, సుయాశ్ ప్రభుదేశాయ్, అనుజ్ రావత్, యశ్ దయాల్, మయాంక్ దగార్.

పంజాబ్ తుది జట్టు : జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, అర్ష్‌దీప్‌ సింగ్, రిలీ రూసో, శశాంక్ సింగ్, సామ్‌ కరన్ (కెప్టెన్‌), లియామ్‌ లివింగ్‌స్టోన్, అశుతోష్‌ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, విధ్వత్‌ కావేరప్ప.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు : తనయ్ త్యాగరాజన్‌, హర్‌ప్రీత్ బ్రార్‌, రిషి ధావన్, జితేశ్‌ శర్మ, నాథన్ ఎలిస్.

కేఎల్ రాహుల్‌పై విరుచుకుపడ్డ లఖ్​నవూ యజమాని! - వైరల్​ వీడియో చూశారా? - IPL 2024 LSG

'అభిషేక్ బ్యాటింగ్​ స్ట్రైల్ ఫుల్​ క్లాస్​- అచ్చం యువీలానే' - Abhishek Sharma IPL

Last Updated : May 10, 2024, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.