RCB VS KKR IPL 2024 : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన పోరులో కోల్‌కతా గెలుపొందింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్ (39), ఫిలిప్ సాల్ట్ (30), సునీల్ నరైన్(47) వెంకటేశ్ అయ్యర్ (50) స్కోర్ చేసి జట్టుకు కీలక పరుగులు అందించారు.
అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు కూడా దూకుడుగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (83*) అలుపెరగని పోరాటం చేసి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించగా, అదే జట్టుకు చెందిన కామెరూన్ గ్రీన్ (33), మాక్స్‌వెల్ (28), దినేశ్ కార్తీక్ (20) కూడా తమ ఆటతీరుతో సత్తా చాటారు. ఇక కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రూ రస్సెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, నరైన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
నో వార్ ఓన్లీ పీస్ - ఆ ఇద్దరూ ఒకటయ్యారుగా
ఇక ఇదే వేదికగా ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. గత కొంతకాలంగా ఉప్పు, నిప్పులా ఉండే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లు ఈ మ్యాచ్‌లో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, పలకరించుకున్నారు. కోల్‌కతా ఫీల్డింగ్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో ఈ మూమెంట్ జరిగింది. ఇది చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపోవడమే మాకు కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఈ రోజు మరో కాంట్రవర్సీ చూసే ఛాన్స్ లేదు అంటూ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు.
-
Joteyali jote joteyali…
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 29, 2024
pic.twitter.com/5qpF8CLQSs
బెంగళూరు తుది జట్టు : ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దగర్, సిరాజ్, యశ్ దయాల్
సబ్‌స్టిట్యూట్స్: మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్, కర్ణ్ శర్మ, విజయ్‌కుమార్, స్వప్నిల్ సింగ్
కోల్‌కతా తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
సబ్‌స్టిట్యూట్స్: సుయాష్ శర్మ, వైభవ్ ఆరోరా, మనీష్ పాండే, రఘువంశీ, గుర్బాజ్
గంభీర్ Vs కోహ్లీ - దినేశ్ కార్తిక్ అలా అనేశాడేంటి? - Dinesh Karthik RCB