RCB vs KKR IPL 2024: 2024 ఐపీఎల్‌లో నేడు (మార్చి 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. అయితే ఐపీఎల్‌లో ఆర్సీబీ- కేకేఆర్ ఫైట్‌ను ఫ్యాన్స్ హై వోల్టెజ్ మ్యాచ్‌లా భావిస్తారు. గతంలో పలుమార్లు గంభీర్- విరాట్ మధ్య జరిగిన వివాదాలే ఇందుకు కారణం. అందుకే ఈ మ్యాచ్‌ను ఆర్సీబీ- కేకేఆర్లా కాకుండా గంభీర్- విరాట్ మధ్య ఫైట్లా భావిస్తారు.
ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌కు సంబంధించి మీమ్స్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఐపీఎల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ జియో సినిమా సైతం ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. దీంతో ఇరుజట్ల అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫైట్‌లో కావాల్సినంత డ్రామా, యాక్షన్ ఉంటుందని, దీంతో ఎంటర్టైన్మెంట్ పక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 గేమ్‌లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించింది. విరాట్, దినేశ్ కార్తిక్ ఫామ్‌లోకి రావడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. మరోవైపు కోల్‌కతా కూడా పటిష్ఠంగానే ఉంది.
ఇక ఈ ప్లేయర్ల మధ్య ఫైట్ చూడాల్సిందే!
- సునీల్ నరైన్- విరాట్ కోహ్లీ: గతంలో ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్‌లో విరాట్ vs నరైన్ ఫైట్ ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో విరాట్‌ను నరైన్ నాలుగుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీంతో మరోసారి విరాట్‌ను ఔట్ చేసేందుకు నరైన్ ప్లాన్ చేస్తుంటే, ఈ కరీబియన్ బౌలింగ్‌ను చిత్తు చేయాలని విరాట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
- అల్జారి జోసెఫ్- శ్రేయస్ అయ్యర్: కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను పేస్ బౌలింగ్‌తో దెబ్బ కొట్టేందుకు ఆర్సీబీ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం వెస్టిండీస్ పేసర్ అల్జారి జోసెఫ్‌తో స్ట్రాటజీ ప్లాన్ చేస్తోంది. తొలిసారి ఆర్సీబీ జట్టులో ఆడతున్న జోసెఫ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో మరి.
- స్టార్క్ వర్సెస్ డుప్లెసిస్: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత కాస్ట్లీ ప్లేయర్ మిచెల్ స్టార్క్. ఈ పేసర్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ సిద్ధమవుతున్నాడు. ఈ ఇద్దరు ఫారిన్ ప్లేయర్ల మధ్య ఫైట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
RCB- KKR Head To Head: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్ రైడర్స్ 32సార్ల తలపడ్డాయి. అందులో కోల్‌కతా అత్యధికంగా 18 మ్యాచ్‌ల్లో నెగ్గగా, బెంగళూరు 14సార్లు విజయం సాధించింది. అన్నింటికంటే ముఖ్యంగా 2017లో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 132 పరుగుల ఛేదనలో 49 పరుగులకే ఆలౌటై ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన చెత్త రికార్డు మూటగట్టుకుంది.
ఐపీఎల్‌లో కేకేఆర్ జర్నీ- గంభీర్ రాకతో కోల్'కథ' మారేనా?
'అందరి ముందు మెక్‌కల్లమ్‌కు సారీ చెప్పా- నాకు ఆ ధైర్యం ఉంది'