ETV Bharat / sports

బ్యాటింగ్ మెరుపులు- ఫీల్డింగ్ విన్యాసాలు- IPL రేంజ్​ కిక్కిస్తున్న WPL - 2024 Wpl Highlights

RCB vs DC WPL 2024: క్రికెట్ లవర్స్​కు గత వారం నుంచి డబ్ల్యూపీఎల్​ ఫుల్ కిక్కిస్తోంది. మహిళల బ్యాటింగ్ మెరుపులు, కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు ఐపీఎల్​ను తలపిస్తున్నాయి.​ తాజాగా జరిగిన ఆర్​సీబీ- దిల్లీ మ్యాచ్ ఇందుకు చక్కని ఉదాహరణ.

RCB vs DC WPL 2024
RCB vs DC WPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 7:21 AM IST

RCB vs DC WPL 2024: 2024 డబ్ల్యూపీఎల్ (Women's Premier League) పురుషుల ఐపీఎల్ (Indian Premier League)కు ఏ మాత్రం తీసిపోదని గురువారం ఆర్​సీబీ- దిల్లీ మ్యాచ్​ ప్రూవ్​ చేసింది. రెండు జట్లు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాయి. ఈ మ్యాచ్​లో 363 పరుగులు నమోదయ్యాయంటే ఫైట్​ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ హై స్కోరింగ్ మ్యాచ్​ స్టేడియంలోని ప్రేక్షకులతోపాటు లైవ్​లో చూసిన ఆడియెన్స్​కు సైతం ఫుల్ మజానిచ్చింది.

టీమ్ఇండియా బ్యాటర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన తుపాన్ ఇన్నింగ్స్​తో రెచ్చిపోయారు. తొలి ఇన్నింగ్స్​లో బౌండరీలతో షఫాలీ కదంతొక్కగా, ఛేజింగ్​లో స్మృతి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. దీంతో మ్యాచ్ ఫలితం ఏమైనప్పటికీ టీమ్ఇండియా బ్యాటర్ల ఇన్నింగ్స్​క్రికెట్​ లవర్స్​కు​ మస్త్ కిక్కిచ్చింది. ఇక తొలి ఇన్నింగ్స్​లో ఆర్​సీబీ ప్లేయర్ జార్జియా వేర్​హమ్ ఫీల్డింగ్ విన్యాసం మ్యాచ్​కై హైలైట్​గా నిలిచింది.

దిల్లీ ఇన్నింగ్స్​లో నడిన్ డి క్లెర్క్​ 11వ ఓవర్ బౌలింగ్ చేసింది. ఈ ఓవర్ రెండో బంతిని షఫాలీ భారీ షాట్​ ఆడింది. దీంతో బంతి స్టాండ్స్ దిశగా దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వేర్​హమ్ అమాంతం గాల్లోకి ఎగిరి ​బంతిని మైదానంలోకి విసిరేసింది. అంతే ఒక్కసారిగా అంతా షాక్​కు గురయ్యారు. వేర్​హమ్ ఫీల్డింగ్ విన్యాసం చూసిన నెటిజన్లు కూడా సూపర్​ ఉమన్​ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రెండో ఇన్నింగ్స్​లో విజయం దిశగా సాగుతున్న ఆర్​బీసీని, దిల్లీ బౌలర్​లు మరిజాన్ కాప్, జెస్ జొనసెన్ అద్భుతంగా అడ్డుకున్నారు. అప్పటిదాకా ఆర్​సీబీ వైపు ఉన్న మ్యాచ్​ను వరుస వికెట్​ల​తో తమవైపు తిప్పుకున్నారు. ​ఇలా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలు, బంతి బంతికి మారే సమీకరణాలు అన్నీ కూడా పరుషుల ఐపీఎల్​ను తలపించిందీ మ్యాచ్​. ఇదే సీజన్ తొలి రెండు మ్యాచ్​లు సైతం ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపాయి. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్​కు కూడా రికార్డ్ స్థాయి వ్యూవర్​షిప్ నమోదు అవుతోంది. ఇలా రానున్న సీజన్​లలో డబ్ల్యూపీఎల్​ కూడా ఐపీఎల్​ అంతటి క్రేజ్​ సంపాదిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని క్రికెట్ లవర్స్​ అభిప్రాయపడుతున్నారు.

హై స్కోరింగ్ మ్యాచ్​లో దిల్లీ థ్రిల్లింగ్ విన్- స్మృతి పోరాటం వృథా

ముంబయి జోరుకు బ్రేక్- యూపీ గ్రాండ్ విక్టరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.