Ravindra Jadeja Injury: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడి షాక్‌లో ఉన్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో జడేజా గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో పరుగు తీస్తుండగా వేగంగా పరిగెత్తడం వల్ల జడేజా అతడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఇబ్బందిపడుతూనే మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం అతడికి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దీనిపై మాట్లాడాడు. 'ఇంకా ఫిజియోను సంప్రదించలేదు. ఇప్పుడే అతడి పరిస్థితి గురించి ఏమీ చెప్పలేం' అని అన్నాడు.
జడ్డూ గాయం తీవ్రతపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. అయితే ఎలాంటి చీలిక లేకుండా కేవలం కండరాలు పట్టేసినా డాక్టర్లు కనీసం వారం పాటు విశ్రాంతి సూచించే ఛాన్స్ ఉంది. మరో నాలుగు రోజుల్లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. దీంతో అతడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా?అనేది అనుమానంగానే కన్పిస్తోంది. ఫిబ్రవరి 02-06 మధ్య విశాఖపట్టణం వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో జట్టుతో కలిసి జడేజా వైజాగ్ వెళ్తాడా? లేదా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపిస్తారా? అన్నదానిపై బీసీసీఐ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.
ఇక ఈ మ్యాచ్‌లో జడ్డూ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో (87 పరుగులు) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇక బౌలింగ్‌లోనూ జడేజా తన మార్క్ చూపించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరులో భారత్ డీలా పడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెరీర్లో తొలి టెస్టు ఆడిన ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ 7 వికెట్లతో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య విశాఖప్టటణం వేదికగా ఫిబ్రవరి 02- 06 రెండో మ్యాచ్ జరగనుంది.
ఉప్పల్ టెస్ట్‌లో భారత్ ఓటమి - 7 వికెట్లతో చెలరేగిన ఇంగ్లాండ్ స్పిన్నర్