Ashwin Test Record : టీమ్‌ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురువారం బంగ్లాదేశ్‌పై సూపర్ సెంచరీ (102* పరుగులు; 112 బంతుల్లో: 10x4, 2x6)తో అదరగొట్టాడు. తొలి రోజు టెస్టులో వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమ్ఇండియాను అశ్విన్ అసాధారణ ఇన్నింగ్స్‌తో ఆదుకొని గౌరవప్రదమైన స్థాయిలో నిలబెట్టాడు. ఈ క్రమంలోనే అశ్విన్ టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించాడు.
అశ్విన్ రికార్డులు
తాజా సెంచరీతో అశ్విన్ టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 20సార్లు 50+ (14 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు) పరుగులు నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో 101 టెస్టులు ఆడిన అశ్విన్ ఇరవై 50+ స్కోర్లు, 30 కంటే ఎక్కువసార్లు 5 వికెట్లు (36సార్లు) పడగొట్టిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. హాఫ్ సెంచరీలు, ఐదు వికెట్లు తీసిన లిస్టులో అశ్విన్‌కి సమీపంలో న్యూజిలాండ్ ప్లేయర్ రిచర్డ్ హ్యాడ్లీ మాత్రమే ఉన్నాడు. హ్యాడ్లీ 17 హాఫ్ సెంచరీలు, 36 సార్లు ఐదు వికెట్లు తీశాడు.
20 కంటే ఎక్కువ సార్లు ఐదు వికెట్లు సాధించిన ఆటగాళ్లలో ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. ఈ ముగ్గురు 20కి పైగా హాఫ్ సెంచరీలు చేశారు. కానీ, ఎవరూ 30 సార్లు 5+ వికెట్స్ ప్రదర్శన చేయలేదు.
A Heroic HUNDRED in 📸📸 @ashwinravi99, that was special 👌👌
— BCCI (@BCCI) September 19, 2024
Scorecard - https://t.co/jV4wK7BgV2#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/J70CPRHcH5
ఫాస్టెస్ట్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో అశ్విన్ కేవలం 58 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదాడు. తన కెరీర్‌లో ఇది రెండో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఆ తర్వాత కేవలం 108 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. అశ్విన్ కెరీర్‌లోనే ఇది వేగవంతమైన సెంచరీ కావడం గమనార్హం. తన సొంత మైదానం చెన్నైలో ఇది రెండో టెస్టు సెంచరీ.
ఆ రికార్డు అందుకుంటాడా?
టెస్టుల్లో అశ్విన్ ఇప్పటి వరకు 516 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా అశ్విన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధికసార్లు(36) ఐదు వికెట్లు తీసిన మూడో ఆటగాడు. అతడు షేన్ వార్న్ (37) రికార్డుకు అతి సమీపంలోనే ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్ (67) అగ్రస్థానంలో ఉండగా, రిచర్డ్ హ్యాడ్లీ (36సార్లు) , అశ్విన్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (35) ఉన్నాడు.
Fans, Family, India - This Ashwin fifty is for everyone 🇮🇳💗 pic.twitter.com/K80GIy3MBQ
— Rajasthan Royals (@rajasthanroyals) September 19, 2024
ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచిన బంగ్లా బౌలింగ్ ఎంచుకొంది. బ్యాటింగ్‌కి దిగిన భారత్ తొలి సెషన్‌లోనే కీలక వికెట్లు కోల్పోయింది. 144-6తో కష్టాల్లో పడింది. క్రీజులో ఉన్న జడేజాతో అశ్విన్ చేరాడు. ఇద్దరూ వేగంగా పరుగులు చేస్తూ ఇండియాని పటిష్ఠ స్థితికి తీసుకెళ్లారు. వీరిద్దరూ కలిసి 7వ వికెట్లు అజేయంగా 195 పరుగులు జోడించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 339-6 స్కోర్‌తో ఉంది.
అశ్విన్, జడ్డు 'ది సేవియర్స్'- దెబ్బకు 24ఏళ్ల రికార్డు బ్రేక్ - Ind vs Ban Test Series 2024
అశ్విన్ అదరహో - సెంచరీతో బంగ్లా బౌలర్లకు చెక్ - Ind vs Ban Test Series 2024