Ranji Trophy Semifinal 2024 : రంజీ ట్రోఫీ 2024 సెమీ ఫైనల్స్‌లో ముంబయి, మధ్యప్రదేశ్ మంచి ప్రదర్శన చేస్తున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈ రెండు టీమ్స్ పైచేయి సాధించాయి. తమ ప్రత్యర్దులపై ఆధిక్యతను ప్రదర్శించాయి.
హిమాన్షు సూపర్ సెంచరీ : నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయి 13 రన్స్ చేసింది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 69 పరుగులు వెనుకపడి ఉంది. అథర్వ తైడే (2) ఔట్ అవ్వగా, దృవ్ షోరే (10), అక్షయ్ వాఖరే (1) క్రీజులో కొనసాగుతున్నారు. అంతకుముందు హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీ బాదడం వల్ల మధ్యప్రదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో హిమాన్షు తప్ప ఎవరూ రాణించలేకపోయారు. ఉమేశ్ యాదవ్ (3/40), యశ్ ఠాకూర్ (3/51), వాఖరే (2/68), సర్వటే (1/48) మధ్యప్రదేశ్‌ను దెబ్బతీశారు. దీని కన్నా ముందు ఆవేశ్ ఖాన్ (4/49) చెలరేగడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ (63) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
శతక్కొట్టిన శార్దూల్(Sardul Thakur Century) : ముంబయి వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ముంబయి జట్టు ఆధిక్యతను కొనసాగిస్తోంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ (109) మెరుపు శతకంతో చెలరేగాడు. దీంతో ముంబయి తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసింది. తద్వారా 207 పరుగుల లీడ్‌లో ఉంది. తమిళనాడు జట్టులో సాయి కిశోర్ ఆరేసి (6/97) రెచ్చిపోయాడు. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) పర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లు సంయుక్తంగా చెలరేగారు. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ తీశారు.
గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ - ఆ జట్టు ప్లేయర్‌కు రోడ్డు ప్రమాదం!
పదో వికెట్‌కు రికార్డ్ పార్ట్నర్షిప్ - టాప్ 10 జోడీలివే!