ETV Bharat / sports

సచిన్​ టు పుజారా- రంజీలో అత్యుత్తమ ప్లేయర్స్ వీరే!

Ranji Trophy 2024 Top Performers :ఇప్పటివరకు వరకు జరిగిన ఈ ఏడాది రంజీ టోర్నీలో అత్యద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చిన ప్లేయర్లు ఎవరంటే ?

Ranji Tropy 2024 Top Performers
Ranji Tropy 2024 Top Performers
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 8:40 PM IST

Ranji Trophy 2024 Top Performers : క్రికెట్​లో ఎంతో మంది స్టార్​ ప్లేయర్లు తమ కెరీర్​ను రంజీతోనే మొదలుపెట్టుంటారు. అన్ని ఫార్మాట్లలోనూ ఈ ఫస్ట్​ క్లాస్​ టోర్నీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది కూడా రంజీ టోర్నీ ఎంతో అత్యద్భుతంగా సాగుతోంది. ఎంతో మంది స్టార్​ ప్లేయర్లు ఈ టోర్నీలో అదరగొడుతున్నారు. వారెవరంటే?

రికీ భుయ్ (ఆంధ్రప్రదేశ్) :
ఆంధ్రా జట్టుకు చెందిన ఈ బ్యాటర్ ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో 75.16 సగటుతో 902 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. రికీ భుయ్ అత్యుత్తమ స్కోరు 175 పరుగులు. ఈ టోర్నీలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్.

సచిన్ బేబీ (కేరళ) :
కేరళకు చెందిన ఈ యంగ్ ప్లేయర్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలతో 58.45 సగటుతో 830 పరుగులు స్కోర్ చేశాడు. ఈ టోర్నీలో అతడి అత్యుత్తమ స్కోరు 131.

ఛెతేశ్వర్ పుజారా (సౌరాష్ట్ర):
టీమ్ఇండియాకు చెందిన ఈ స్టార్ క్రికెటర్ ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలతో చెలరేగిపోయాడు. 69.08 సగటుతో 829 పరుగులు చేశాడు. ఇక ఈ టోర్నీలో పుజారా అత్యుత్తమ స్కోరు 243.

ఆర్. సాయి కిషోర్ (తమిళనాడు):
ఈ యంగ్​ ఆల్-రౌండర్ ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 18.78 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5/66. అతడు ఇప్పటివరకు ఆరు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్లు సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఇతడు టాప్​ పొజిషన్​లో ఉన్నాడు.

ఎస్ అజిత్ రామ్ (తమిళనాడు):
తమిళనాడుకు చెందిన స్పిన్నర్ అజిత్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 14.09 సగటుతో 41 వికెట్లు తీశాడు. తన బౌలింగ్​ స్కిల్స్​తో సాయి కిషోర్‌కు సరైన భాగస్వామిగా నిలిచాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 6/83.

గౌరవ్ యాదవ్ (పాండిచ్చేరి) :
పుదుచ్చేరికి చెందిన ఈ 32 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 14.58 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు. అతడు అత్యుత్తమ గణాంకాలు 7/49. ఈ టోర్నీలో ఇప్పటి వరకు గౌరర్ ఐదు సార్లు ఐదు వికెట్ల పెర్ఫామెన్స్​తో అదరగొట్టాడు.

రంజీ ట్రోఫీ సెమీఫైనల్​ - శార్దూల్, హిమాన్షు అద్భుత శతకాలు

ఆరేళ్ల తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం - రంజీలోనూ మహిళలకు రెడ్‌బాల్ టోర్నీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.