Team India Head Coach Form: టీమ్ఇండియా హెడ్‌కోచ్ ఎంపికకు బీసీసీఐ సెలక్షన్ ప్రాసెస్‌ను మొదలు పెట్టింది. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అప్లై చేసుకునేందుకు దరఖాస్తుదారుల కోసం గూగుల్ ఫామ్ విడుదల చేసింది. ఇంత ఉన్నతమైన పోస్ట్ అప్లికేషన్ ప్రాసెస్‌కి గూగుల్ ఫామ్ వినియోగిస్తుండటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరికొందరైతే మీమ్స్, ఫన్నీ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ ట్విట్టర్ యూజర్ (@SudiptoDoc), తాను టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. అంతే కాదు తనకున్న అర్హతల గురించి ట్విట్టర్లో రాసుకొచ్చాడు. అతడు వివరించిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో నెటిజన్ పోస్టు వైరల్‌గా మారింది.
'నేను స్కూల్ డేస్‌లో గల్లీ క్రికెట్ ఆడాను. నా బౌలింగ్ ఎవ్వరూ ఆడలేకపోయేవారు. ఎందుకంటే అవి వికెట్ల వరకు వెళ్లేవే కాదు. నేను స్టైలిష్ బ్యాటర్‌ని కూడా. చెప్పాలంటే చాలా స్టైలిష్. క్యాప్, కళ్లద్దాలు, సన్‌స్క్రీన్, నా ట్రౌజర్ జేబులో రెడ్ కర్చీఫ్ అన్నీ ఉండేవి. గేమ్ ఆడేటప్పుడు బబుల్ గమ్ నమిలేవాడిని. నా ఫీల్డింగ్ కూడా సూపర్‌గా ఉంటుంది. నేను వికెట్ కీపర్ కాకపోవచ్చు, కానీ ఆటలో అన్ని విభాగాల్లో రాణిస్తున్నప్పుడు ఎవరు పట్టించుకుంటారు. అందుకే నేను ఎందుకు భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా సరిపోను? త్వరలోనే బీసీసీఐ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నా' అని రాసుకొచ్చాడు.
నెటిజన్ల మిశ్రమ స్పందన
అయితే అతడి ట్విట్టర్ అకౌంట్ బయో (Bio)లో డాక్టర్ అని రాసుకున్నాడు. దీంతో డాక్టర్ కోచ్ పదవికి అప్లై చేయడంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఓ యూజర్, ఎలాన్ మస్క్‌ను 'అతడి బ్లూ టిక్‌ను తీసివేయమని' రిక్వెస్ట్ చేశాడు. లాంగ్ సెంటెన్స్‌లు రాసే ఫెసిలిటీని దుర్వినియోగం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. 'ఇంటర్వ్యూకి ఆల్ ది బెస్ట్. కోహ్లి ఏది చెప్పినా అతనితో అంగీకరించడానికి సిద్ధంగా ఉండు. పని తేలికవుతుంది' అని మరో నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు.
హెడ్‌కోచ్ రేస్‌లో లక్ష్మణ్, లాంగర్?- ఉండాల్సిన ఆ అర్హతలివే! - Team India New Head Coach
టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం! - Teamindia HeadCoach