Rajni Trophy 2024 Five Cricketers Retirement : రంజీ ట్రోఫీ 2023-24 చివరి దశకు చేరుకుంది. అయితే ఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్‌తో ఐదుగురు దేశవాళీ టాప్ క్రికెటర్స్ రిటైర్ కాబోతున్నారు. వివరాల్లోకి వెళితే.
Manoj Tiwari Retirement : టీమ్ఇండియా మాజీ క్రికెటర్, బంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. బిహార్‌తో మ్యాచ్ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. బంగాల్ తరపున 148 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 47.86 యావరేజ్‌తో 10,195 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 30 శతకాలు ఉన్నాయి. తివారీ గతంలో టీమ్ ఇండియాకు కూడా ప్రాతినిథ్యం వహించాడు.
టీమ్ ఇండియా వెటరన్, ఝార్ఖండ్ స్టార్ ప్లేయర్ సౌరభ్ తివారి కూడా ఆటకు గుడ్‌బై చెప్పాడు.రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం తన 17 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. ఝార్ఖండ్ తరఫున 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 22 శతకాలు బాదాడు. 8030 పరుగులు చేశాడు. భారత్ తరఫున 3 వన్డేలు కూడా ఆడాడు.
టీమ్ ఇండియా ఓపెనర్, విధర్బ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్ కూడా డొమాస్టిక్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లో హరియాణాతో మ్యాచ్ అనంతరం ఆటకు బై చెప్పాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 137 మ్యాచ్‌లు ఆడిన అతడు 24 శతకాలు, 39 అర్థ శతకాల సాయంతో 9,183 పరుగులు సాధించాడు. ఇతడు కూడా 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ధోని కెప్టెన్సీ టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్, మరో ఝార్ఖండ్ క్రికెట్ ప్లేయర్ వరుణ్ ఆరోన్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం ఆట నుంచి అతడు తప్పుకున్నాడు. 2008లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన అతడు 65 మ్యాచ్‌లు ఆడాడు. 168 వికెట్లు తీశాడు. ఇందులో ఆరుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది..
Dhawal Kulkarni Retirement : భారత ఫాస్ట్ బౌలర్, ముంబయి వెటరన్ పేసర్ ధవల్ కులకర్ణి కూడా ఆటకు ముగింపు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ అనంతరం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పకోనున్నట్లు తెలిపాడు. ముంబయి తరపున ఇప్పటివరకు 95 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 281 వికెట్లు తీశాడు. 2016లో ధోని సారథ్యంలోనే టీమ్ ఇండియా తరపున కులకర్ణి అరంగేట్రం చేశాడు. అతడికి ధోని నుంచి మంచి సపోర్ట్ కూడా ఉండేది. కానీ తర్వాత కులకర్ణి ఫెయిల్ అవ్వడంతో జట్టులో చోటు కోల్పోయాడు.
రంజీ ట్రోఫీలో రికార్డ్ ఛేజింగ్ - 90 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!
స్టేట్ ఐకాన్‌గా శుభ్‌మన్- లోక్‌సభ ఎన్నికల్లో గిల్- పంజాబ్‌లో టార్గెట్ అదే!