Rahul Dravid Coach T20 World Cup: టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలంపై బీసీసీఐ సెక్రటరీ జై షా క్లారిటీ ఇచ్చారు. ద్రవిడ్ 2024 టీ20 ప్రపంచకప్ వరకు టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా కొనసాగుతాడని షా వెల్లడించారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్ తర్వాత ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగిసిపోయింది. అయితే డిసెంబర్- జనవరిలో జరిగిన సౌతాఫ్రికా పర్యటన వరకు ద్రవిడ్‌తోపాటు సపోర్టింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్‌ను పొడిగించినప్పటికీ ఎంతకాలం అనేది పేర్కొనలేదు. దీనిపై తాజాగా షా క్లారిటీ ఇచ్చారు.
'ద్రవిడ్ లాంటి సీనియర్ ప్లేయర్ కాంట్రాక్ట్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టీ20 వరల్డ్‌కప్ దాకా ఆయనే కోచ్‌గా ఉంటారు. 2023 వరల్డ్‌కప్ తర్వాత రాహుల్ భాయ్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ద్రవిడ్‌ను కలవలేకపోయా. ఫైనల్‌గా ఈరోజు కలుసుకున్నాం' అని షా అన్నారు. ఇక ఐపీఎల్ గురించి కూడా షా వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో అన్ని ఫ్రాంఛైజీలు బీసీసీఐ నిబంధనలు పాటించాల్సిందేనని అన్నారు. బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు అధిష్ఠానమని గుర్తుంచుకోవాలని తెలిపారు. అయితే టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లపై పడే పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని షా ఈ వ్యాఖ్యలు చేశారు.
రోహితే మన కెప్టెన్: రోహిత్ శర్మ టీ20 వరల్డ్‌కప్ దాకా టీమ్ఇండియాకు కెప్టెన్‌గా కొనసాగుతాడని షా రీసెంట్గా స్పష్టం చేశారు. గుజరాత్లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న షా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.'2024లో బార్బడోస్ గ్రౌండ్లో రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 వరల్డ్‌కప్ గెలుస్తుంది' అని షా ఆశాభావం వ్యక్తం చేశారు.
T20 World Cup 2024: 2024 జూన్‌లో పొట్టి ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.20 జట్లు ఈ పొట్టి కప్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. టీమ్ఇండియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జూన్ 5 ప్రారంభమవుతాయి. అయితే, ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కానీ, క్రికెట్ వర్గాల ప్రకారం భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య జూన్ 9న మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - రోహిత్ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్