ETV Bharat / sports

రాజు తలొంచాడు - ఎర్రకోటలో ఆఖరి ఆట! - Rafael Nadal French Open

author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 7:37 AM IST

French Open Rafael Nadal : తన అద్భుతమైన ఆటతో దాదాపు రెండు దశాబ్దాలు రొలాండ్‌ గారోస్‌ను శాసించిన రఫెల్​ నాదల్​ అధ్యాయానికి తెరపడ్డట్లే. అప్రతిహత విజయాలతో అభిమానులను ఉర్రూతలూగించిన అతడిని మళ్లీ మనం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో చూడలేం! ఈసారి తొలి రౌండ్లోనే పరాజయం పొందిన అతడు మళ్లీ ఇక్కడ ఆడే అవకాశాలు చాలా చాలా తక్కువని ప్రకటించి అభిమానుల్ని షాక్​కు గురి చేశాడు.

source The Associated Press
French Open Rafael Nadal (source The Associated Press)

French Open Rafael Nadal : ఫ్రెంచ్‌ ఓపెన్‌ అంటే నాదల్‌, నాదల్‌ అంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌ అనేలా తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ స్పెయిల్ బుల్. ఇంకా చెప్పాలంటే ఎర్రకోటలో అతడికి అసలే తిరుగేలేదు. విజయాల మీద విజయాలు. టైటిళ్ల మీద టైటిళ్లు. ప్రత్యర్థెవరైనా మట్టి కరవాల్సిందే. అలా దాదాపు రెండు దశాబ్దాలు రొలాండ్‌ గారోస్‌ను శాసించాడు. మొత్తంగా కెరీర్​లో ఊహకందని రీతిలో ఏకంగా 14 టైటిళ్లు చేజిక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు ఓ గొప్ప అధ్యాయానికి తెరపడింది!.మళ్లీ తనను ఫ్రెంచ్‌ ఓపెన్‌లో చూడలేం! అనేలా సంకేతాలిచ్చాడు.

తొలి రౌండ్​లోనే ఔట్ - తాజాగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్​ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు నాదల్​. వాస్తవానికి గతేడాది గాయం కారణంగా రొలాండ్‌ గారోస్‌కు అందుబాటులో ఉండలేకపోయిన 37 ఏళ్ల నాదల్‌ ఈసారి కూడా దాదాపు తప్పుకుంటాడేమోని అంతా అనుకున్నారు. కానీ కెరీర్‌లో చివరిసారిగా ఎర్రమట్టి టైటిల్‌ కోసం పోరాడాలి అనుకున్నాడేమో ఎంతో ఆశతో ఈ సారి పారిస్‌కు వచ్చాడు. కానీ నాదల్‌కు ఇక్కడ తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. జ్వెరెవ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. 3-6, 6-7 (5-7), 3-6తో నాలుగోసీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) చేతిలో ఓడాడు. మొత్తం మూడు గంటల పాటు సాగిన ఈ పోరులో ఒక్క రెండో సెట్లో మాత్రమే నాదల్‌ గట్టిగా పోరాడాడు.

కచ్చితంగా చెప్పలేను - ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించే రఫెల్​ నాదల్​ ఇలా తొలి రౌండ్లోనే ఓడిపోవడం అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ - ఏడాదిన్నరగా గాయాలు, ఫిట్‌నెస్‌ లేమి వల్ల ఒకప్పటి జోరు లేదన్నది స్పష్టం. అందుకే అతడు పెద్దగా పోటీ ఇవ్వకుండానే నిష్క్రమించాడు. తుంటి, ఉదర కండరాల గాయాల కారణంగా అతడు 2023 జనవరి నుంచి 15 మ్యాచ్‌లే ఆడాడు. దీంతో చాలా కాలం నంబర్‌వన్‌గా ఉన్న అతడు ఈ మధ్య ఎక్కువగా ఆడకపోవడం వల్ల 275వ ర్యాంకుకు పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మొదటి సారి అన్‌సీడెడ్‌గా దిగాడు. తొలి రౌండ్లోనే నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ చేతిలో ఓడిపోయాడు. దీంతో ప్రేక్షకులు కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే అతడు షాకింగ్ విషయాన్ని చెప్పి మరింత ఎమోషనల్ చేశాడు. మళ్లీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడతానని కచ్చితంగా చెప్పలేనని అన్నాడు.

"అందరికీ కృతజ్ఞతలు. మాట్లాడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడడం ఇదే చివరి సారా అంటే కచ్చితంగా చెప్పలేను. గత రెండేళ్లలో గాయాల వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. నేను మళ్లీ ఇక్కడికి వచ్చే అవకాశాలే ఎక్కువ. కానీ అది కచ్చితమని చెప్పలేను. ఒలింపిక్స్‌ కోసం మాత్రం ఇక్కడికి మళ్లీ వస్తానని అనుకుంటున్నాను" అని నాదల్‌ పేర్కొన్నాడు.

అప్పటితో మొదలు - ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 2005లో మొదలైన నాదల్‌ టైటిళ్ల వేట ఆ తర్వాత కొనసాగుతూనే ఉంది. తిరుగులేని ఆధిపత్యంతో 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022 వరకు ట్రోఫీలను అందుకున్నాడు. ఇతర గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ సత్తా చాటాడు. మొత్తంగా కెరీర్​లో 22 మేజర్‌ టైటిళ్లను ముద్దాడాడు.

కేకేఆర్‌ సక్సెస్‌లో ఆ ఇద్దరే కీలకం - జట్టు కోసం ఏం చేశారంటే? - IPL 2024 winner KKR

ఐపీఎల్​, డబ్ల్యూపీఎల్​ ఫైనల్​ - ఈ ఇంట్రెస్టింగ్​ పోలికలను గమనించారా? - IPL 2024 and WPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.