ETV Bharat / sports

స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ సాధించిన టాప్ రికార్డులివే! - RAFAEL NADAL RECORDS

రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్​ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్​ టాప్ రికార్డులు ఇవే

source Getty Images
Rafael Nadal Records (source Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 10, 2024, 9:24 PM IST

Rafael Nadal Records : టెన్నిస్​ దిగ్గజం రఫెల్ నాదల్​​ ఆటకు వీడ్కోలు పలికాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తన చివరి టోర్నీ అని తెలిపాడు. అయితే ఈ స్పెయిన్​ బుల్​​​ తన అద్భుతమైన ప్రదర్శనతో దాదాపు రెండు దశాబ్దాల పాటు క్లే కోర్టును శాసించాడు. ఊహకందని రీతిలో ఏకంగా 14 టైటిళ్లను ఖాతాలో వేసుకున్నాడు. ఓ సారి నాదల్ తన కెరీర్‌లో సాధించిన రికార్డులను తెలుసుకుందాం.

రికార్డులివే -

  • రఫెల్​ నాదల్​ తన కెరీర్​లో 22 గ్రాండ్ స్లామ్‌లు అందుకున్నాడు. నోవాక్‌ జకోవిచ్ 24 టైటిల్స్​తో అగ్ర స్థానంలో ఉన్నాడు.
  • నాదల్​ ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెన్స్​ సింగిల్స్‌లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 14 టైటిల్స్‌ను ముద్దాడాడు. ఓపెన్​లో శకంలో ఇదే అత్యధికం. జోర్న్ బోర్గ్ ఆరు టైటిళ్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
  • రఫా 30 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్​లో బరిలోకి దిగాడు. రోజర్ ఫెదరర్ (31), నోవాక్ జకోవిచ్ (37), నాదల్​ కన్నా ముందున్నారు.
  • ఓపెన్​లో ఎర్రమట్టి కోర్టులో నాదల్‌ అత్యధికంగా 63 టైటిళ్లను అందుకున్నాడు.
  • నాదల్​​ ఫ్రెంచ్​ ఓపెన్​లో 112 మ్యాచుల్లో విజయం సాధించాడు. నాలుగు సార్లు మాత్రమే పరాజయం అందుకున్నాడు. చివరగా ఈ ఏడాది అలెగ్జాండర్ జ్వెరెవ్‌ చేతిలో ఓడిపోయాడు.
  • నాదల్​​ 92 ఏటీపీ సింగిల్స్ టైటిళ్లను ముద్దాడాడు. జిమ్మీ కానర్స్ 109 టైటిళ్లతో, రోజర్ ఫెదరర్ 103 టైటిళ్లతో, నోవాక్ జకోవిచ్ 99 టైటిళ్లతో, ఇవాన్ లెండి 94 టైటిళ్లతో తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు.
  • స్పెయిన్ బుల్​ 2004 నుంచి 2022 వరకు ఏటీపీ సింగిల్స్ టైటిల్‌ను వరుసగా అత్యధికంగా 19 సంవత్సరాలు గెలుచుకున్న రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
  • 2005 - 2007 మధ్య క్లే కోర్టులో వరుసగా 81 మ్యాచుల్లో విజయాలు సాధించాడు.
  • మెన్స్​ సింగిల్స్​లో కెరీర్ గోల్డెన్ స్లామ్ పూర్తి చేసిన ముగ్గురు ప్లేయర్స్​లో రాఫెల్ నాదల్ ఒకడు. మిగతా ఇద్దరు ఆండ్రీ అగస్సీ, రోజర్ ఫెదరర్.
  • కెరీర్​లో గ్రాండ్ స్లామ్‌ సాధించడంతో పాటు ఒలింపిక్స్‌ సింగిల్స్​, డబుల్స్‌లో గోల్డ్​ సాధించిన ఏకైక ప్లేయర్ నాదల్.
  • ప్రపంచ నెంబర్‌ వన్‌ ప్లేయర్స్‌పై అత్యధికంగా 23 విజయాలు సాధించిన ప్లేయర్​గా నాదల్ రికార్డుకెక్కాడు.
  • నాదల్ తన కెరీర్‌లో ఐదు సార్లు 2008, 2010, 2013, 2017, 2019 ప్రపంచ నంబర్‌ వన్‌గా అవతరించాడు.

టెన్నిస్‌ దిగ్గజం రఫెల్ నాదల్ మొత్తం ఆస్తులు ఎంతో తెలుసా?

రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం రఫెల్‌ నాదల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.