ETV Bharat / sports

న్యూజిలాండ్​ సిరీస్​లో రచిన్ అజేయ శతకం - 12 ఏళ్లలో తొలి కివీస్ ప్లేయర్​గా రికార్డు - RACHIN RAVINDRA INDIA VS NEWZEALAND

రచిన్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ - భారత్​లో తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసిన కివీస్ బ్యాటర్​గా రికార్డు!

India Vs Newzealand 1st Test
Rachin Ravindra (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 18, 2024, 12:52 PM IST

Rachin Ravindra India Vs Newzealand 1st Test : భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (104*) శతకంతో చెలరేగిపోయాడు. అలా భారత్​లో తొలి శతకం బాదిన కివీస్ ప్లేయర్​గా రచిన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మూడోరోజు ఆట లంచ్‌ బ్రేక్ సమయానికి కివీస్ సేన ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు నమోదు చేసింది. దీంతో టీమ్ఇండియాపై తొలి ఇన్నింగ్స్​లో ఆ జట్టు ఆధిక్యం 299కి చేరింది. రచిన్​తో పాటు టిమ్‌ సౌథీ (49*) ఎనిమిదో వికెట్‌ సమయానికి సెంచరీ పార్ట్​నర్​షిప్​ను నమోదు చేశాడు. కేవలం 97 బంతుల్లోనే ఈ ఇద్దరూ 112 పరుగులను జోడించారు. అలా బ్రేక్ సమయానికి సౌథీ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

మ్యాచ్ సాగిందిలా :
ఓవర్‌నైట్ 180/3 స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుపై భారత బౌలర్లు తొలుత ఆధిపత్యం ప్రదర్శించారు. కట్టుదిట్టంగా బాల్స్ వేస్తూ పరుగులు చేయనీకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా సిరాజ్‌, బుమ్రా, జడేజా అద్భుతమైన బంతులతో వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో కివీస్ జట్టు స్కోర్ ఒక్కసారిగా 233/7గా మారిపోయింది. ఆ జట్టులోని డారిల్ మిచెల్ 18, టామ్ బ్లండెల్ 5, గ్లెన్ ఫిలిప్స్ 14, మాట్ హెన్రీ 8 పరుగులు నమోదు చేశారు.

అయితే కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగియడానికి మరికొంతసేపే అన్న తరుణంలో రచిన్ - టిమ్‌ సౌథీ జోడీ భారత జట్టును బెంబేలెత్తించింది. పేస్, స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా తట్టుకొని మరీ పరుగులు స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ జోడీ విడదీయడానికి బౌలర్లను మార్చినా కూడా భారత జట్టుకు ఏమాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. అలా దాదాపు 300కి పైగా స్కోర్​ లీడ్‌తో ఈ మ్యాచ్‌పై కివీస్‌ పట్టు సాధించినట్లైంది. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, బుమ్రా, సిరాజ్, అశ్విన్, కుల్‌దీప్‌ చెరో వికెట్ పడగొట్టారు.

క్రికెట్ హిస్టరీలో అత్యల్ప స్కోర్లు - మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియా నమోదు చేసినవి ఇవే!

5 డకౌట్​లు, 46 పరుగులకే ఆలౌట్​ - 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.