ETV Bharat / sports

అప్పుడు ధోని వికెట్‌ తీయడమే నా లక్ష్యం : అశ్విన్‌ - R Ashwin About MS Dhoni

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 9:55 PM IST

R Ashwin About MS Dhoni : సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌, ఎంఎస్‌ ధోని చాలా కాలం కలిసి క్రికెట్‌ ఆడారు. వీరిద్దరి మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా అశ్విన్ బయటపెట్టాడు. అదేంటంటే?

R Ashwin About MS Dhoni
R Ashwin About MS Dhoni (ANI)

R Ashwin About MS Dhoni : భారత సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ ఇప్పుడు రచయితగా మారాడు. అతడు తాజాగా 'ఐ హావ్ ది స్ట్రీట్స్- ఎ కుట్టి క్రికెట్ స్టోరీ' అనే పుస్తకాన్ని రచించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బుక్​ రిలీజ్ ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. అందులో క్రికెట్ గురించి అనేక విషయాలు పంచుకున్న అశ్విన్​, లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి, తనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

"2008లో నాలాంటి వ్యక్తి ఉన్నాడని కూడా ఎంఎస్‌ ధోనికి తెలియదు. అందుకే 2009 నుంచి ఎంఎస్‌ MS ధోని వికెట్‌ తీయడమే నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. నాగ్‌పూర్‌లో జరిగిన ఛాలెంజర్ ట్రోఫీలో నేను అద్భుతంగా బౌలింగ్ చేశాను. నా స్పెల్‌ మొత్తం ధోని రన్స్‌ స్కోర్‌ చేయడానికి కష్టపడ్డాడు. ఫైనల్లో అతన్ని ఔట్‌ చేశాను. అప్పటి నుంచి ధోనీ నన్ను స్కిల్‌ ఉన్న ప్లేయర్‌గా చూశాడు. రిలేషన్‌ పెరిగింది. గుర్రం పందానికి సిద్ధంగా లేదని ధోని నిర్ణయిస్తే, అతను మిమ్మల్ని సెలక్ట్‌ చేసుకోడు. మీరు పందానికి సిద్ధంగా ఉన్న గుర్రమని అతనికి తెలియాలి. అతనికి మీ గురించి తెలిస్తే, తర్వాత మీపై పూర్తి నమ్మకం ఉంచుతాడు." అంటూ ధోనీతో ఉన్న తన అనుభవాలను పంచుకున్నాడు.

చెన్నైలో అశ్విన్‌ కీలకం
ఐపీఎల్​లో 2008 నుంచి 2015 వరకు అశ్విన్‌ చెన్నై సూపర్ కింగ్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దాదాపు 8 సీజన్లలో 97 మ్యాచుల్లో 90 వికెట్లు పడగొట్టాడు. 2009లో కేవలం రెండు గేమ్‌లు ఆడడం నుంచి 2010 నుంచి సీఎస్కే లైనప్‌లో కీలక ఆటగాడిగా అశ్విన్‌ మారాడు. ఆ సంవత్సరం ఫ్రాంచైజీకి మొదటి ఐపీఎల్‌ టైటిల్‌ను దక్కడంలో అశ్విన్‌ కీలక పాత్ర పోషించాడు.

2011 లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ సీజన్​లో ఏకంగా 20 వికెట్లు సాధించాడు. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అంతే కాకుండా చెన్నై జట్టు తమ రెండో టైటిల్‌ గెలుపులోనూ అశ్విన్ కృషి ఉంది.

ఇక ఎనిమిది సీజన్లలో చెన్నైకి ప్రాతినిధ్యం వహించిన తర్వాత, అశ్విన్ కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్), దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌కి మారాడు. ప్రస్తుతం రాజస్థాన్​ జట్టులో కీలక స్పిన్నర్​గా కొనసాగుతున్నాడు. ఆ జట్టుకు అనేక మ్యాచుల్లోనూ విజయాన్ని అందించాడు.

'క్రికెటర్లలో అతడొక చెస్‌ ప్లేయర్‌గా అనిపిస్తాడు'- అశ్విన్​పై చెస్​ దిగ్గజం ప్రశంసలు

టాప్ పొజిషన్​లోకి అశ్విన్- ర్యాంకింగ్స్​లో హిట్​మ్యాన్ జోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.