Punjab Kings IPL 2024: 2024 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ముంబయి ఇండియన్స్‌తో తాజాగా జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్ 9 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ప్రస్తుత సీజన్లో పంజాబ్ ఐదో ఓటమిని మూటగట్టుకుంది. ఇక ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ అందులో కేవలం 2 విజయాలే నమోదు చేసి 4 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతున్నాయి.
అయితే పంజాబ్ ఐదు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ క్రికెట్ లవర్స్‌ను మాత్రం ఎంటర్టైన్ చేస్తోంది. ఓడిన ఐదింట్లో కూడా మ్యాచ్ మధ్యలోనే చేతులెత్తేయకుండా ఆఖరి ఓవర్ వరకు పోరాడి ఆడియెన్స్‌కు మాజా పంచింది. తాజాగా ముంబయితో మ్యాచ్‌లోనూ అదే జరిగింది. 193 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఘనమైన ఆరంభం దక్కలేదు. 2.1 ఓవర్లలో 14 పరుగుకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో పంజాబ్ 100 పరుగులైనా చేస్తుందా? అని అందరూ అనుకున్నారు. కానీ, శశాంక్ సింగ్ (41 పరుగులు, 25 బంతుల్లో) బాధ్యతాయుతమైన ప్రదర్శనతో పంజాబ్ ఇన్నింగ్స్ గాడిన పడింది.
ఇక అశుతోష్ శర్మ (61 పరుగులు; 28 బంతుల్లో: 2x4, 7x6) మెరుపులతో పంజాబ్ గెలుపు ఖాయమైందనే భావించారంతా. ఆకాశ్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్లో ఏకంగా 24 పరుగుల రావడం వల్ల సాధించాల్సిన రన్‌రేట్ 7కు పడిపోయింది. చివరి 4 ఓవర్లలో పంజాబ్‌కు 28 పరుగులు అవసరమయ్యాయి. దీంతో పంజాబ్ విజయానిపై ఎవరికీ సందేహాల్లేవ్. కానీ, ఆ తర్వాత ఓవర్లలో వరుసగా బుమ్రా (3 పరుగులు), గెరాల్డ్ (వికెట్+ 2 పరుగులు) ప్రదర్శనతో ముంబయి రేస్‌లోకి వచ్చింది. ఇక ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన దశలో 10వ వికెట్ పడగొట్టిన ఆకాశ్ ముంబయి గెలుపు ఖరారు చేశాడు. దీంతో మరోసారి పంజాబ్ ఆఖరి దాకా వచ్చి ఓటమి చవిచూసింది.
ఇదే సీజన్లో ఆఖరి ఓవర్ దాకా థ్రిల్లింగ్‌గా సాగిన పంజాబ్ మ్యాచ్‌లు
- పంజాబ్- 176/6 (20) vs ఆర్సీబీ- 178/6 (19.2)- ఓటమి
- పంజాబ్- 200/7 (19.5) vs గుజరాత్- 199/4 (20)- గెలుపు
- పంజాబ్- 180/6 (20) vs సన్‌రైజర్స్- 182/9 (20)- ఓటమి
- పంజాబ్- 147/8 (20) vs రాజస్థాన్- 152/7 (19.5)- ఓటమి
- పంజాబ్- 181/10 (19.1) vs ముంబయి- 192/7 (20)- ఓటమి
పంజాబ్‌పై ముంబయి ఇండియన్స్ విజయం - IPL 2024
ధావన్ జెర్సీలో మార్పు- ఇకపై కొడుకు పేరుతోనే బరిలోకి? - IPL 2024