IPL PSL Clash : భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అత్యంత విజయవంతంగా నిలవడం వల్ల చాలా దేశాలు ఈ టీ20 లీగ్‌ను అనుసరించాయి. అలా మొదలైన వాటిల్లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) కూడా ఒకటి. అయితే వచ్చే ఏడాది పీఎస్‌ఎల్, ఐపీఎల్ మధ్య క్లాష్ జరిగే అవకాశముందని అంటున్నారు.
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ కారణంగా వచ్చే ఏడాది ఐపీఎల్ తేదీలు, పీఎస్‌ఎల్ తేదీలు క్లాస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. PSL సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలలో జరుగుతుంది. IPL మార్చి చివరిలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం కూడా పీఎస్‌ఎల్ ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 వరకు నిర్వహించారు. 2024 ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి మే 26 వరకు జరిగింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), పీఎస్‌ఎల్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 10 నుంచి మే 25 మధ్య నిర్వహించవచ్చని సంకేతాలు ఇస్తోంది.
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఇబ్బంది కలగకుండా పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను రీషెడ్యూల్ చేయాలని ఈ నిర్ణయం తీసుకుందట. ఒకవేళ ఇదే జరిగి ఐపీఎల్‌తో క్లాష్ అయితే రెండు లీగ్స్‌లో ఆడే ఇంటర్నేషనల్ ప్లేయర్స్, బ్రాడ్‌కాస్ట్ వ్యూవర్‌షిప్, స్పాన్సర్స్‌పై ప్రభావం పడుతుంది.
ఇకపోతే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB), పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు సంబంధించి తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు దేశీయ ఆటగాళ్లకు నెలవారీ వేతనాలలో మార్పులు కూడా చేసింది.
- PSL 2025 వరకు పాకిస్థాన్ అంతర్జాతీయ షెడ్యూల్ ఇదే?
బంగ్లాదేశ్‌తో హోమ్ సిరీస్: 2024 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 3 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది.
ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్: 2024 అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 28 వరకు మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది.
ఆస్ట్రేలియా పర్యటన: 2024 నవంబర్ 4 నుంచి నవంబర్ 18 వరకు మూడు వన్డేలు, మూడు టీ20లకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.
జింబాబ్వే పర్యటన: 2024 నవంబర్ 24 నుంచి నుండి డిసెంబర్ 5 వరకు మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం జింబాబ్వే వెళ్తుంది.
దక్షిణాఫ్రికా పర్యటన: 2024 డిసెంబర్ 10 నుంచి 2025 జనవరి 7 వరకు మూడు T20Iలు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందుకు సుదీర్ఘకాలం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది.
వెస్టిండీస్‌తో హోమ్ సిరీస్: 2025 జనవరి 16 నుంచి రెండు టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
స్వదేశంలో ట్రై-సిరీస్: 2025 జనవరి 16 నుంచి ఫిబ్రవరి 14 వరకు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో ట్రై సిరీస్‌లో పాల్గొంటుంది.
పాకిస్థాన్‌లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంకా తేదీలు ప్రకటించాల్సి ఉంది. ట్రై-సిరీస్ పూర్తయ్యాక ఛాంపియన్స్ ట్రోఫీ జరగవచ్చు.
న్యూజిలాండ్ పర్యటన: 2025 మార్చి 16 నుంచి ఏప్రిల్ 5 వరకు ఐదు T20Iలు, మూడు వన్డేలు ఆడుతుంది.
షారుక్-నెస్ వాడియా ఐపీఎల్ కాంట్రవర్సీ - 'మెగా వేలం వద్దు, రిటెన్షన్ పెంచాల్సిందే' - IPL Owners Meeting
రూ.1.3 లక్షల కోట్లకు పెరిగిన ఐపీఎల్ వ్యాల్యూ - టాప్‌లో సీఎస్కే, ముంబయి డౌన్ - IPL Teams Brand value