Prithvi Shaw Century : గాయంతో ఆటకు దూరమైన టీమ్ఇండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో ముంబయి తరుపున బరిలోకి దిగి సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 107 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 159 పరుగులు చేశాడు.
అండర్ 19 క్రికెట్ నుంచి టీమ్ఇండియాలోకి షా రాకెట్లా దూసుకొచ్చాడు. కానీ అంతే వేగంగా జట్టు నుంచి బయటికి వెళ్లాడు. అయితే గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే కప్ టోర్నీలో పృథ్వీ షా పరుగుల వర్షం కురింపించాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున శతకాల మోత మోగించాడు. రెండు శతకాలతో పాటు ఓ సెన్సేషనల్ సెంచరీ బాదాడు. అయితే తిరిగి టీమ్ఇండియాలో స్థానం సంపాదించుకునే సమయంలో మోకాలి గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు.
ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ
గాయంతో బాధపడ్డ షా ఆ తర్వాత లండన్‌లో సర్జరీ చేయించుకున్నాడు. దాని తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మూడు నెలలు పాటు ఉండి రెస్ట్ తీసుకున్నాడు. ఆరు నెలలకు పైగా శ్రమించి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్సీఏ పృథ్వీషాకు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించి అతడికి క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో తిరిగి రంజీ ట్రోఫీలో ముంబయి టీమ్ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఈ ఫార్మాట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఛత్తీస్‌గఢ్ మ్యాచ్ కంటే ముందు బెంగాల్‌తో జరిగిన పోరులో ఆడాడు. 42 బంతుల్లో 35 పరుగులు చేశాడు. కానీ, భారీ స్కోరును చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు.
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు ఆటలో 75 ఓవర్లకు ముంబయి వికెట్ నష్టానికి 280 పరుగులు చేసింది. భూపేన్ లాల్వానీతో కలిసి పృథ్వీ షా జట్టుకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 244 పరుగులు జోడించారు. ఇక పృథ్వీ షా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది పదమూడో సెంచరీ.
U-19 వరల్డ్ కప్- భారత్ ఖాతాలో ఐదు టైటిళ్లు- టీమ్ఇండియా సక్సెస్ఫుల్ జర్నీ మీకు తెలుసా?
అండర్-19తో క్రికెట్లోకి ఎంట్రీ- ఒక్క రోహిత్ తప్ప అందరూ రిటైర్!