T20 World Cup 2024 Celebrities Wishes : ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగులతో తేడాతో భారత్ జట్టు విజయం సాధించడం వల్ల అభినందనలు వెల్లువెత్తాయి. అసలు గెలుస్తుందో లేదో అనే సందేహాల నుంచి అద్భుత విజయం అందుకున్న టీమ్ఇండియాను ప్రముఖులు ఆకాశానికి ఎత్తేశారు. రాజకీయ నాయకుల నుంచి క్రీడా, సీనీ ప్రముఖల వరకూ భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.
'కోట్ల మంది హృదయాలు గెలుచుకున్నారు'
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత జట్టుకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. అకుంఠిత స్ఫూర్తితో ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన నైపుణ్యం కనబరిచారని భారత జట్టు సభ్యులను కొనియాడారు. యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని టీమ్ఇండియాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్రిడ్జ్‌టౌన్ భారత్ విజయం సాధించిన వెంటనే ట్విట్టర్‌లో ప్రధాని మోదీ ఒక వీడియోను పోస్ట్ చేసి అభినందనలు తెలుపుతూ ఆనందాన్ని పంచుకున్నారు. 'ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ టోర్నీ విజేతగా నిలవడం చిన్న విషయంకాదు. భవ్య విజయం సాధించిన భారత జట్టుకు దేశ ప్రజలందరి తరపున అభినందనలు. ఈ రోజు 140 కోట్ల మంది దేశ ప్రజలు మీ(భారత జట్టు) అసాధారణ ప్రదర్శన చూసి గర్వపడుతున్నారు. క్రీడా మైదానంలో మీరు ప్రపంచకప్‌ను గెలుచుకున్నారు. అలాగే భారత్‌లోని ప్రతి గ్రామం, ప్రతి వీధిలో కోట్ల మంది హృదయాలనూ గెలుచుకున్నారు' అని ప్రధాని మోదీ అన్నారు.
My heartiest congratulations to Team India for winning the T20 World Cup. With the never-say-die spirit, the team sailed through difficult situations and demonstrated outstanding skills throughout the tournament. It was an extraordinary victory in the final match. Well done, Team…
— President of India (@rashtrapatibhvn) June 29, 2024
CHAMPIONS!
— Narendra Modi (@narendramodi) June 29, 2024
Our team brings the T20 World Cup home in STYLE!
We are proud of the Indian Cricket Team.
This match was HISTORIC. 🇮🇳 🏏 🏆 pic.twitter.com/HhaKGwwEDt
'టీమ్ఇండియా దేశాన్ని గర్వపడేలా చేసింది'
భారత జట్టుకు అభినందనలు తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, టోర్నీ మొత్తం జట్టు విలక్షణమైన ఆటతీరును కనబరిచిందని ప్రశంసించారు. అద్భుతమైన క్యాచ్ పట్టావని సూర్యకుమార్‌ను, నీ నాయకత్వానికి ఇది నిదర్శనమంటూ రోహిత్ శర్మను రాహుల్ గాంధీ కొనియాడారు. మెన్ ఇన్ బ్లూ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత జట్టుకు అభినందనలు తెలిపారు. అంకితభావంతో ఆడి గెలిచారని కొనియాడారు. భారత క్రికెట్ జట్టు విజయం దేశానికి సుప్రసిద్ధమైన సమయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బృంద స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి అద్భుతమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టు విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కోట్ల మందిని ప్రేరేపించి, నిజమైన క్రీడా స్ఫూర్తిని చాటారని భారత జట్టును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్‌లో కొనియాడారు. కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సమాచారశాఖ మంత్రి జ్యోదిరాదిత్యసింధియా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ పార్టీల నాయకులు భారత జట్టును అభినందిస్తూ పోస్టులు పెట్టారు.
Congratulations to Team India on a spectacular World Cup Victory and a phenomenal performance throughout the tournament!
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2024
Surya, what a brilliant catch! Rohit, this win is a testament to your leadership. Rahul, I know team India will miss your guidance.
The spectacular Men in… pic.twitter.com/lkYlu33egb
Congratulations to world champion Team 🇮🇳.
— Amit Shah (@AmitShah) June 29, 2024
A glorious moment for our nation.
Our players put up a stellar performance throughout the #T20WorldCup with unmatched team spirit and sportsmanship. The nation swells with pride at their historic achievement.
Well done 👏#INDvSA
మాజీ క్రికెటర్ల ప్రశంసలు
మాజీ క్రికెటర్ల నుంచి భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి. తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ సేన ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. తన గుండె వేగం పెరిగిందని, తర్వాత సర్దుకుందని ఇన్‌స్టాలో ధోనీ పేర్కొన్నాడు. తనకు మంచి పుట్టిన రోజు కానుక ఇచ్చారని వచ్చేనెలలో 43వజన్మదినం జరుపుకోనున్న ధోనీ పేర్కొన్నాడు. భారత్ నాలుగో నక్షత్రం సాధించిందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ వ్యాఖ్యానించాడు. 1983, 2011 వన్డే ప్రపంచకప్ విజయాలు, 2007లో టీ20 ప్రపంచకప్ విజయాన్ని మూడు స్టార్లుగా సచిన్ అభివర్ణించాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీని, విరాట్, బుమ్రా ఆటను, కోచ్ ద్రవిడ్‌ను సచిన్ ప్రశంసించాడు. వీవీఎస్ లక్ష్మణ్ నుంచి విరాట్ కోహ్లీ వరకూ, సౌరభ్ గంగూలీ నుంచి గౌతమ్ గంభీర్ వరకూ మాజీ క్రికెటర్లు భారత జట్టు విజయంపై హర్షం వ్యక్తంచేశారు.
Every star added to the Team India jersey inspires our nation’s starry-eyed children to move one step closer to their dreams. India gets the 4th star, our second in @T20WorldCup.
— Sachin Tendulkar (@sachin_rt) June 29, 2024
Life comes full circle for Indian cricket in the West Indies. From our lows in the 2007 ODI World… pic.twitter.com/HMievynpsE
సినీ నటుల అభినందనలు
అద్బుతమైన ఫైనల్ అంటూ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టుకు అభినందనలు తెలిపిన సత్య నాదెళ్ల బాగా ఆడిందని దక్షిణాఫ్రికా జట్టును సైతం మెచ్చుకున్నారు. వెస్టిండీస్, అమెరికాలో మరింత క్రికెట్ ఆడాలని ఆయన అభిలాషించారు. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ "ఏం ఆట" అని ప్రసంశలు కురిపించారు. విజయానికి భారత్ అర్హమైన జట్టని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా జట్టు ఆటతీరును కూడా కొనియాడారు. సినీ నటులు అజయ్ దేవగన్, రవీనా టాండన్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో టీమిండియాను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మాటలు చాలవని అజయ్ దేవగన్ పేర్కొన్నాడు. భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు.
what a game, could barely breathe, everything that makes sports incredible. Congrats India, so well deserved! SA was incredible. Amazing #WorldT20
— Sundar Pichai (@sundarpichai) June 29, 2024
Words can't describe the joy! Congratulations Team India, you've made history! 🎉🇮🇳
— Ajay Devgn (@ajaydevgn) June 29, 2024
This victory is etched in our hearts♥️#T20WorldCup #INDvSA2024
ఛాంపియన్‌గా భారత్- రోహిత్, విరాట్ ఎమోషనల్- గోల్డెన్ మూమెంట్స్ చూశారా? - T20 World Cup 2024