ETV Bharat / sports

పోరాడి ఓడిన పంజాబ్‌ - రాజస్థాన్​ సూపర్ విక్టరీ! - PKBS vs RR IPL 2024 - PKBS VS RR IPL 2024

PKBS vs RR IPL 2024: 2024 ఐపీఎల్​లో లీగ్ మ్యాచ్​లో భాగంగా రాజస్థాన్ రాయల్స్- పంజాప్ కింగ్స్ జట్లు శనివారం తలపడ్డాయి. ఈ ఉత్కంఠ పోరులో ఆఖరి విజయం రాజస్థాన్​ను వరించింది.

PKBS vs RR IPL 2024
PKBS vs RR IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 10:57 PM IST

Updated : Apr 14, 2024, 6:22 AM IST

PKBS vs RR IPL 2024 : ఐపీఎల్​లో సీజన్ 17లో భాగంగా శనివారం జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్​దే పై చేయిగా నిలిచింది. నిర్దిష్ట ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచింది. కేశవ్‌ మహరాజ్‌ (2/23), అవేష్‌ ఖాన్‌ (2/34), బౌల్ట్‌ (1/22) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల తొలుత పంజాబ్‌ 147/8కే పరిమితమైంది. అశుతోష్‌ (31); టాప్‌ స్కోరర్​గా నిలిచాడు. ఇక స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్‌ (39); టాప్‌ స్కోరర్​గా నిలవగా, ఆఖర్లో హెట్‌మయర్‌ (27*) అత్యంత కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ టైడే (15 పరుగులు), జానీ బెయిర్ స్టో (15 పరుగులు) విఫలమయ్యారు. వన్​డౌన్​లో వచ్చిన ప్రభ్​సిమ్రన్ సింగ్ (10), శామ్ కర్రన్ (6), శశాంక్ సింగ్ (9) కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు నమోదు చేయలేదు. జితేశ్ శర్మ (29 పరుగులు), లివింగ్​స్టోన్ (21 పరుగులు) ఫర్వాలేదనిపించారు. చివర్లో అశుతోశ్ శర్మ (31 పరుగులు, 16 బంతుల్లో) రాణించడం వల్ల పంజాబ్ ఆ మాత్రమ స్కోరైనా చేయగలిగింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2, ఆవేశ్ ఖాన్ 2, ట్రెంట్ బోల్ట్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

రాజస్థాన్ రాయల్స్ (తుది జట్టు): సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, తనుష్ కొటియన్, కేశవ్ మహరాజ్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్

పంజాబ్ కింగ్స్ (తుది జట్టు): జానీ బెయిర్‌స్టో, అథర్వ టైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్( కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ

మయాంక్ యాదవ్ గాయం - బిగ్ అప్డేట్ ఇచ్చిన కేఎల్ రాహుల్ - KL Rahul Mayank Yadav

కొత్త కుర్రాడి మెరుపులు - లఖ్​నవూపై దిల్లీ విజయం - LSG vs DC IPL 2024

Last Updated : Apr 14, 2024, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.