Pakisthan YOYO Test : టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి పాకిస్థాన్ అనూహ్యంగా గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ టీమ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB), టీమ్‌ను పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. పాత బలమైన పాకిస్థాన్ టీమ్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలను మెరుగుపరిచేందుకు యో-యో టెస్ట్‌ను తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది.
- కొత్త ఫిట్‌నెస్ మోడల్‌కు ఆమోదం
గతంలో యో-యో టెస్ట్‌లు ఇర్రెగ్యులర్‌గా జరిగేవి. అయితే డొమెస్టిక్ క్రికెట్ కొత్త డైరెక్టర్ ఖుర్రం నియాజీ, కాంప్రహెన్సివ్ ఫిట్‌నెస్ మోడల్‌ను ఆమోదించారు. ఈ మోడల్ రెగ్యులర్‌గా, సిస్టమేటిక్‌గ ఫిట్‌నెస్ టెస్ట్‌లు నిర్వహించేలా చూస్తుంది. ఈ టెస్ట్‌లు జులై 11న ప్రారంభమవుతాయి. రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో జిల్లా స్థాయిలో టెస్ట్‌లు ప్రారంభమవుతాయి. రెండో దశలో రీజినల్ లెవల్లో జరుగుతాయి. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కూడా ఈ కొత్త మోడల్‌ను ఆమోదించారు.
- టెస్టులో ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?
యో-యో టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించని ఆటగాళ్లు జాతీయ, ప్రాంతీయ జట్లలో చోటు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. రీజినల్ కాంట్రాక్ట్స్, జట్టు ఎంపికలకు ఈ టెస్టుల్లో ఉత్తీర్ణత తప్పనిసరి అని నియాజీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆటగాడు అయినా లేదా జాతీయ స్థాయి ఆటగాడు అయినా ఈ టెస్టుల నుంచి మినహాయింపు ఉండదు.
- మహ్మద్ హఫీజ్ విమర్శలు
గత టీమ్ మేనేజ్‌మెంట్ ఫిట్‌నెస్ ప్రమాణాలను సడలించిందని పాకిస్థాన్ జట్టు మాజీ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ విమర్శించారు. మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్ జట్టు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు యో-యో టెస్ట్, ఇతర ఫిట్‌నెస్ అసెస్‌మెంట్‌లకు ప్రాముఖ్యత ఇవ్వలేదని క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌లో హఫీజ్ పేర్కొన్నాడు. మేనేజ్‌మెంట్ రిలాక్స్‌డ్ ఫిట్‌నెస్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వడానికి టీమ్ ట్రైనర్ అంగీకరించడంపై నిరాశ వ్యక్తం చేశాడు.
- బంగ్లాతో టెస్ట్ సిరీస్
యో-యో టెస్ట్‌ను తిరిగి ప్రవేశపెట్టడంతో, ప్రపంచ క్రికెట్‌లోని అగ్రశ్రేణి జట్ల మాదిరిగానే పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఫిట్‌గా ఉండేలా చూడాలని పీసీబీ లక్ష్యంగా పెట్టుకుంది. పాక్ స్వదేశంలో ఆగస్టులో బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ 2023-2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగం. ప్రస్తుతం పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 8వ స్థానంలో ఉంది.
ఇండో పాక్ మ్యాచ్‌కు పీసీబీ ప్లాన్ - ఆ రెండు నగరాలు ఫిక్స్! - ICC Championship Trophy 2025
'ఆ వరల్డ్‌కప్ నాకెంతో బాధను మిగిల్చింది - రాత్రంతా ఏడ్చాను' - Gautam Gambhir World Cup