Paris paralympics 2024 Avani Lekhara : అవని లేఖరా ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం జరుగుతోన్న పారాలింపిక్స్‌లో పసిడి సాధించింది. 2020 టోక్యో పారాలింపిక్స్, 2024 పారిస్ పారాలింపిక్స్, సంవత్సరాలు, వేదికలు మాత్రమే మారాయి. కానీ అవని లేఖరా పసిడి గురి మాత్రం తప్పలేదు. అప్పుడూ ఇప్పుడూ పారాలింపిక్స్ రికార్డును బ్రేక్ చేసి గోల్డ్‌ను పట్టేసింది. తద్వారా పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన రెండో భారత అథ్లెట్‌గా నిలిచింది. అలానే ఈ ఘనత సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గానూ నిలిచింది.
నొప్పిని భరిస్తూ సాధన(Avani Lekhara Gold Medal) - 19 ఏళ్లకే టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అవనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే ఆమె నిలకడ ప్రదర్శనను కొనసాగిస్తూ ప్రపంచ కప్‌ల్లో కూడా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ సాధించింది. గతేడాది ఆసియా పారా క్రీడల్లోనూ ఛాంపియన్‌గా అవతరించింది.
అయితే ఈ ఏడాది మార్చిలో దిల్లీ వేదిగా జరిగిన ప్రపంచ కప్‌లో మాత్రం రెండూ బ్రాండ్ మెడల్స్నే సాధించింది. ఇది ఆమె స్థాయికి తగ్గ ప్రదర్శన కాదు. వాస్తవానికి పిత్తాశయంలో రాళ్ల కారణంగా తీవ్రమైన నొప్పిని అనుభవించింది అవని. ఆ ప్రభావం ఆమె గురి తప్పేలా చేసింది. అందుకే బ్రాంజ్ మెడల్స్‌తో సరిపెట్టుకుంది. అయినప్పటికీ నొప్పిని భరిస్తూనే 2023 నుంచి అవని ఆటను కొనసాగించింది. ఇక పారిస్ పారాలింపిక్స్ వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది(2024) మార్చిలో శస్త్రచికిత్స(Avani Lekhara Surgery) చేయించుకుని పిత్తాశయాన్ని తొలగించుకుంది.
అనంతరం రెండు నెలలు రెస్ట్ తీసుకుని ప్రాక్టీస్ మొదలెట్టింది. అయితే సర్జరీ కారణంగా ఆమె కండరాలు బలహీనంగా మారాయి. సాధనలో ఆమె శరీరం చాలా సార్లు వణికేది. కానీ ఆటపై ఉన్న ప్రేమ, నిబద్ధత, అంకిత భావం, పారాలింపిక్స్‌లో గోల్డ్ అందుకోవాలనే తపన, ఆమెలో బలాన్ని పెంచాయి.
అలా దిల్లీ ప్రపంచ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మోనాను దాటి ఇప్పుడు అవని మళ్లీ ఛాంపియన్‌గా అవతరించింది.
🇮🇳 Golden & Bronze Glory! 🇮🇳
— Paralympic Committee of India (@PCI_IN_Official) August 30, 2024
In an outstanding display of talent and perseverance, Avani Lekhara wins gold and Mona Agarwal secures bronze in the R2 Women 10m Air Rifle SH1 event. These champions have made India proud, raising our flag high on the world stage! 🏅🥉#ProudMoment… pic.twitter.com/7EXca8qtop
చిన్న వయసులోనే యాక్సిడెంట్(Avani Lekhara Car Accident) - రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అమ్మాయి అవని. ఆమె జీవితం పదేళ్ల పాటు హాయిగానే సాగింది. కానీ 11 ఏళ్ల వయసులో జరిగిన ఓ అనుకోని కారు ప్రమాదం (2012లో) ఆమె జీవితాన్ని మార్చేసింది. అవని నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. దీంతో ఆమె చక్రాల కుర్చీకే పరిమితమైంది.
ఆ సమయంలో తండ్రి ప్రోత్సాహంతో అవని ఆటల వైపు దృష్టి పెట్టింది. మొదట ఆర్చరీలో శిక్షణ తీసుకుంది. అయితే 2008 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన అభినవ్ బింద్రా స్ఫూర్తితో అవనీ షూటింగ్‌వైపు వెళ్లింది. 2015లో తుపాకీ పట్టుకుంది. అద్దె తుపాకీతో కెరీర్‌ను ప్రారంభించి అదే ఏడాది పారా జాతీయ ఛాంపియన్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
అనంతరం అంతర్జాతీయ వేదికలపైనా సత్తా చాటడం ప్రారంభించింది. చేతులు, నడుము కింది భాగం, కాళ్లలో వైకల్యం ఉన్నవాళ్లు పోటీ పడే ఎస్‌హెచ్1 విభాగంలో తాను కూడా పోటీ చేసింది. జూనియర్, సీనియర్ స్థాయిలో ప్రపంచ రికార్డులు సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్ యూనివర్సిటిలో న్యాయశాస్త్రం చదువుతోంది. ఆమె ఇప్పటికే ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలను కూడా దక్కించుకుంది.
మరిన్ని పతకాలు గెలవాలని - ఇకపోతే టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్‌తో పాటు 50మీ.రైఫిల్ 3 పొజిషన్స్‌లోనూ పతకం (కాంస్యం) నెగ్గింది అవని. అలానే ఈ సారి కూడా ఒకటి కన్నా ఎక్కువ పతకాలు గెలవాలనుకుంటోంది. ప్రస్తుతం అవని 10మీ.ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ప్రోన్ ఎస్‌హెచ్1, మహిళల 50మీ.రైఫిల్ 3 పొజిషన్స్‌లోనూ బరిలో దిగనుంది.
పారాలింపిక్స్‌లో భారత్ బోణీ - ఒకేరోజు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ - Paralympics India 2024
ఆ 5 రికార్డులను బ్రేక్ చేయడం విరాట్‌కు సాధ్యమేనా? - Sachin Virat Record Comparison