Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా, చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా, చారిత్రక కట్టడాల మధ్యలో సెన్ నదిపై ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నదికి రెండు వైపులా కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు అద్భుతంగా కొనసాగాయి.
అయితే ఈ వేడుకల్లో ప్రదర్శించిన లాస్ట్ సప్పర్ థీమ్ ఈవెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ ఈవెంట్లో 18 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన క్రైస్తవ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ లాస్ట్ సప్పర్ షోకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. అయితే హాస్యపూరితమైన రీతిలో ప్రజల్లో చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. తప్పుగా భావించొద్దని విజ్ఞప్తి చేశారు.
వారిని ఎక్కనీయకుండా(Nigeria women's basketball team) - ఇకపోతే ఈ సెయిన్ నదిపై 6 కిలోమీటర్ల పాటు సాగిన పొడవైన పరేడ్ ఆఫ్ నేషన్స్‌లో 206 దేశాల నుంచి 6500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. వీరందా 94 బోట్లలో ప్రయాణించారు. అయితే ఇదే సమయంలో కొందరు అథ్లెట్లను పడవ ఎక్కకుండా అడ్డుకున్నారు అధికారులు. ఇది స్వల్ప వివాదానికి దారి తీసింది.
Controversy erupts as the Paris Olympics' Pride celebration features a Last Supper-themed event, sparking outrage among Christian communities worldwide. 🌈⛪️ #ParisOlympics #Pride #LastSupper #paris2024olympics pic.twitter.com/Pn1qxW2Rxt
— 3 Ps & A Pod (@3Ps_Pod) July 26, 2024
అసలేం జరిగిదంటే - ఒలింపిక్ క్రీడల ఈ పరేడ్‌లో గ్రీకు అథ్లెట్ల టీమ్ మొదటి స్థానంలో ఉండగా ఆతిథ్య దేశం ఫ్రాన్స్ చివరి స్థానంలో నిలిచింది. ఇతర దేశాల అథ్లెట్లు కూడా వరుసగా బోట్లలో ప్రయాణించారు. అయితే నైజీరియా మహిళల బాస్కెట్‌బాల్ టీమ్‌కు మాత్రం ఈ డెలిగేషన్ బోట్‌లో ఎక్కడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు.
నైజిరీయా అధికారులే తమ జట్టు క్రీడాకారులను అడ్డుకున్నారు. అయితే అందుకు కారణం అప్పటికే బోట్‌లో చాలా మంది క్రీడాకారులు ఉన్నందునే ఇలా చేశారట. అందుకే నైజీరియా మహిళల బాస్కెట్‌బాల్ జట్టుతో పాటు టీమ్ కోచ్‌ను బోట్‌లోకి ఎక్కనీయలేదట. దీంతో ఈ మహిళల బాస్కెట్ బాల్ టీమ్ తిరిగి అథ్లెట్స్ విలేజ్‌కు వెళ్లాల్సి వచ్చింది.