Paris Olympics Indian Athletes Food : ఒలింపిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ టోర్నీ బరిలో దిగి విజయం సాధించాలని, పతకం నెగ్గాలని ప్రతీ అథ్లెట్‌కు ఓ పెద్ద కల. అదే జీవిత లక్ష్యంగా కెరీర్లో ముందుకెళ్లే వారు చాలా మందే ఉన్నారు. అయితే చాలా మంది అథ్లెట్లకు ఒలింపిక్స్ సహా విదేశాల్లోని ఇతర ఏ ప్రతిష్ఠాత్మక పోటీలకు వెళ్లినా భోజనం విషయంలో భారత అథ్లెట్లకు కాస్త ఇబ్బందులు ఎదురౌతూనే ఉంటాయి.
అయితే ఈ ఏడాది అలా జరగకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు ఒలింపిక్స్ నిర్వాహకులు. పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో అథ్లెట్ల గ్రామంలో భారతీయ వంటకాలను ఏర్పాటు చేయనున్నారు. మనవాళ్లు ఎంచక్కా బాస్మతి బియ్యంతో చేసిన రైస్ ఇంకా పప్పు, చపాతీ, ఆలుగడ్డ- గోబీ, చికెన్, పులుసులను వడ్డించనున్నారు. అవును మీరు చదివింది నిజం. భారత అథ్లెట్లకు ప్రత్యేక ఆహారం ఏర్పాటు చేసేలా ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వాహకులకు భోజనాల లిస్ట్‌ను పంపించేశారు. ఈ విషయాన్ని భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ కేశవన్ తెలిపారు.
"భారత వంటకాలతో కూడిన మెను ఉండాలని మనం చేసిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పోషకాహార నిపుణుల సూచనల మేరకే ఈ లిస్ట్‌ను తయారు చేశాం. మన అథ్లెట్లకు ఆహారం విషయంలో పెద్ద సమస్య ఉంది. ఒలింపిక్స్‌లోనూ కూడా ప్రధాన భోజన శాలలో ప్రపంచవ్యాప్తం ఉన్గాన అన్ని రకాల వంటకాలు ఉంటాయి. ఒక్క మనోళ్లకు మినహా. అందుకే మనవాళ్ల కోసం దక్షిణాసియా వంటకాలు తయారు చేయించాలని పట్టుబట్టాం" అని శివ పేర్కొన్నాారు.
మరోవైపు అథ్లెట్ల గ్రామంలో పూర్తిస్థాయి భారత క్రీడా సైన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు డాక్టర్ దిన్‌షా పర్దీవాలా పర్యవేక్షణలో ఇది జరగనుంది. అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్, క్రికెటర్ రిషబ్ పంత్‌కు చికిత్స అందించింది దిన్‌షానే. ఈ క్రీజా సైన్స్ కేంద్రంలో అన్ని రకాల మెడిసెన్స్, కోలుకునేందుకు అవసరమైన సామగ్రి ఉంటుంది. ఇప్పటికే ఈ క్రీడా సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు కోసం భారత్ నుంచి చాలా యంత్రాలను అక్కడికి పంపించారు. ఇంకా పారిస్ ఒలింపిక్స్ కోసం రవాణా, పాటించాల్సిన నియమ నిబంధనలు ఇంకా తదితర విషయాలను మన అథ్లెట్లుగా ముందుగానే వివరిస్తామని కూడా శివ తెలిపారు.
6 బంతుల్లో 6 బౌండరీలు - పంత్ మెరుపు షాట్లకు షారుక్ ఫిదా! - IPL 2024 KKR VS Delhi Capitals
గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టిన సునీల్ - 7 ఫోర్లు 7 సిక్స్‌లతో విశాఖలో వీరబాదుడు - IPL 2024 DC VS KKR