Paris Olympics 2024 : ఈ ఇద్దరి అభిరుచులు వేర్వేరు. ఆమెకేమో గుర్రపు స్వారి చేయడం, వయోలిన్ వాయించడం, బొమ్మలు గీయడం ఇష్టం. ఇక అతనికేమో రేస్ కార్లను ట్రాక్‌పై పరుగులు పెట్టించడం, హుషారైన పంజాబీ పాటలు వినడం ఇంట్రెస్ట్. ఇలా భిన్న ధ్రువాల్లాంటి ఈ ఇద్దరూ దేశం కోసం శ్రమించి పతకాన్ని సాధించారు. వారే మను బాకర్, సరబ్‌జోత్ సింగ్.
బాక్సింగ్, టెన్నిస్, స్కేటింగ్ ఇలా వివిధ క్రీడల్లో పట్టు సాధించినప్పటికీ, షూటింగ్‌పైనే మనసు పారేసుకుంది మను. ఇక సరబ్‌జ్యోత్‌ల కూడా తనకిష్టమైన ఫుట్‌బాల్‌ను తుపాకీ పట్టుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లోని అనుభవంతో మను, అలాగే తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగిన ఉత్సాహంతో సరబ్‌జ్యోత్ ఈ ఇద్దరూ కలిసి మిక్స్‌డ్ విభాగంలో రాణించారు. ఒకరు వెనుకబడ్డా కూడా మరొకరు మెరుగైన ఫామ్ కనబరిచి విజయతీరాలకు చేరుకున్నారు.
తాజాగా జరిగిన కాంస్య పోరులో కొన్ని షాట్లలో సరబ్‌జోత్ 8.6, 9.6, 9.4 స్కోరు చేస్తే, దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మను (10.2, 10.5, 10.6) ముందుకొచ్చింది. చివరిలో మను 9.6, 9.4 చేస్తే, సరబ్‌జోత్ 9.7, 10.2తో విజయాన్ని అందించాడు. మిక్స్‌డ్ టీమ్‌లో వీళ్లిద్దరు కలిసి గెలిచిన తొలి పతకం ఇదే. ఆసియా క్రీడలు, ప్రపంచకప్‌లో దివ్యతో కలిసి సరబ్‌జోత్ స్వర్ణాలు నెగ్గాడు.
ధైర్యం చెప్పి - శిక్షణ ఇచ్చి
ఒలింపిక్స్ షూటింగ్‌లో భారత్ ఇప్పటివరకూ రెండు పతకాలు గెలవడం వెనుక ఓ వ్యక్తి కీలక పాత్ర ఉంది. ఆమె పేరే మంక్‌బయర్ డోర్జ్‌సురెన్. తాజాగా మిక్స్‌డ్ టీమ్ కాంస్య పోరు మధ్యలో ఒత్తిడికి గురైన మను-సరబ్‌జ్యోత్ దగ్గరకు వెళ్లి ఆమె వాళ్లకు ధైర్యాన్ని నింపింది. దీంతో ఈమె గురించి క్రీడాభిమానులు మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు. భారత పిస్టల్ ప్లేయర్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈమె, వాళ్లకు అత్యుత్తమ శిక్షణతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా అందిస్తూ అండగా నిలుస్తోంది.
మంగోలియాలో పుట్టి జర్మనీలో స్థిరపడ్డ ఈ 55 ఏళ్ల కోచ్, 6 ఒలింపిక్స్‌ల్లో పోటీపడి 25మీ పిస్టల్‌లో రెండు కాంస్యాలు గెలిచింది. 1992, 1996, 2000లో మంగోలియాకు, 2004, 2008 (కాంస్యం), 2012 ఒలింపిక్స్‌ల్లో జర్మనీకి ప్రాతినిథ్యం వహించిన ఆమె, 10మీ, 25మీ పిస్టల్‌లో ప్రపంచ ఛాంపియన్‌గానూ చరిత్రకెక్కింది. 2022 జులైలో భారత పిస్టల్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టింది. ఇక భారత షూటర్ రహి సర్నోబత్‌కు వ్యక్తిగత కోచ్‌గానూ వ్యవహరించింది.
ఒలింపిక్స్‌లో మను బాకర్ విజయాల వెనక రానా - Paris Olympics 2024
భారత ఒలింపిక్స్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఇదే - మను బాకర్‌కు ఎంత ఇస్తారంటే? - Paris Olympics 2024