ETV Bharat / sports

ఒలింపిక్స్ @ 100 - నది నుంచి స్టేడియంలోకి ఓపెనింగ్ ఈవెంట్! - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024 Opening Ceremony : ఈ ఏడాది ఒలింపిక్స్‌ వేడుక కోసం సర్వం సిద్ధమవుతోంది. అయితే ఈ మెగా క్రీడల కోసం నిర్వహకులు కొన్ని కీలక మార్పులు చేయనున్నారు. అవేంటంటే ?

Paris Olympics 2024 Opening Ceremony
Paris Olympics 2024 Opening Ceremony
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 7:49 AM IST

Paris Olympics 2024 Opening Ceremony : ఈ ఏడాది ఒలింపిక్స్‌ వేడుక కోసం సర్వం సిద్ధమవుతోంది. ఈవెంట్​కు ఇక 100 రోజులే సమయం ఉన్నందున నిర్వాహకులు కూడా జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. గ్రీస్‌లోని ఒలింపియాలో మంగళవారం (ఏప్రిల్ 16)న ఈ వేడుకకు సంబంధించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గ్రాండ్​గా జరగనుంది. అయితే చరిత్రలోనే తొలిసారిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఫ్రాన్స్‌లో ప్రవహించే సెన్‌ నది ఈ ప్రారంభోత్సవ వేడుకలకు వేదిక కానుంది. అయితే కానీ భద్రతా కారణాల వల్ల అవసరమైతే ఈ వేదికను మారుస్తామంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ఇటీవలే పేర్కొన్నారు. తీవ్రమైన భద్రత హెచ్చరికలు వస్తే స్టాడ్‌ డి ఫ్రాన్స్‌ జాతీయ స్టేడియంలోనే ఈ వేడుకలను నిర్వహిస్తామంటూ ఆయన చెప్పారు. అయితే ఈ ఈవెంట్​ను కచ్చితంగా నదిలోనే నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.

నదిలో దాదాపు 6 కిలోమీటర్ల దూరానికి సుమారు 10,500 మంది అథ్లెట్లు పడవల్లో పరేడ్‌ నిర్వహించనున్నారు. నదికి రెండు వైపుల ఉండి జులై 26న జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మొదట 6 లక్షల మంది ప్రజలను అనుమతించాలనుకున్నారు. కానీ భద్రత కారణాల వల్ల దీన్ని 3 లక్షలకు పరిమితం చేశారు.

ట్రాక్ కలర్ ఛేంజ్​!
మరోవైపు ఒలింపిక్స్​ ట్రాక్ కలర్​ను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పరుగు పోటీల కోసం ఉపయోగించే ట్రాక్‌ సాధారణంగా ఇటుక ఎరుపు రంగులో కనిపిస్తుంది. కానీ ఈ సారి పారిస్‌ ఒలింపిక్స్‌లో మాత్రం ఆ ట్రాక్‌ను ఉదా రంగులో మార్చనున్నారు. ఇలాంటి ట్రాక్​ను నిర్మించడం కూడా ఇదే తొలిసారి. ట్రాక్‌ విభాగాల్లో పోటీలకు వేదికైన జాతీయ స్టేడియం స్టాడ్‌ డి ఫ్రాన్స్‌లోనే ఈ ఉదా రంగు ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గత ఒలింపిక్స్‌లోనూ ట్రాక్‌ విభాగాల్లో మూడు ప్రపంచ, 12 ఒలింపిక్‌ రికార్డులు బద్దలయ్యాయి. ఈ సారి ఆ సంఖ్య పెరిగే ఆస్కారమున్నట్లు తెలుస్తోంది.

ఒలింపిక్స్​లో తొలిసారిగా గోల్డ్​ మెడల్ విన్నర్​కు 50,000 డాలర్లు - Olympics Gold Medal

పారిస్‌ ఒలింపిక్స్‌లో పప్పు అన్నం, చికెన్​ - Paris Olympics Indian Athletes Food

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.