Paris Olympics 2024 Sarabjot singh Shooting Medal : పడి లేచిన కెరటం అతడు. కోల్పోయినా చోటే తిరిగి సంపాదించుకున్నాడు. 3 రోజుల క్రితమే ఒలింపిక్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ తుది పోరులో బెర్త్‌ను త్రుటిలో కోల్పోయాడు. కానీ పోరాటాన్ని వదల్లేదు. అవకాశం ఉన్న మిక్స్డ్ విభాగంపై పూర్తిగా దృష్టి సారించాడు. చివరికి తాను అనుకున్నది సాధించి ఔరా అనిపించాడు. అతడే సరబజ్యోత్ సింగ్. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మను బాకర్-సరబ్ జోత్ సింగ్ జోడీ దక్షిణ కొరియా జట్టును 16-10 తేడాతో ఓడించి భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. ఈ నేపథ్యంలో సరబ్జోత్ సింగ్ వ్యక్తిగత, క్రీడా విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మూడో షూటర్‌గా రికార్డు - 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో దక్షిణ కొరియా జట్టును మట్టికరించడం వల్ల అరుదైన ఘనతను సరబజ్యోత్ సింగ్ సాధించాడు. ఎయిర్ పిస్టర్ ఈవెంట్లో గగన్ నారంగ్, విజయ్ కుమార్ తర్వాత పతకం సాధించిన మూడో భారత షూటర్‌గా నిలిచాడు. గగన్ నారంగ్ కాంస్య పతకం గెలిచిన 2012 జులై 30 నాటి నుంచి కచ్చితంగా 12 ఏళ్ల తర్వాత అదే తేదీన సరబ్జోత్ సింగ్ విజయం సాధించడం గమనార్హం.
రైతు కుటుంబంలో పుట్టి- ఎయిర్ పిస్టల్‌పై ఆసక్తి
సరబ్జోత్ సింగ్ హరియాణలోని అంబాలా సమీపంలోని ధేన్ గ్రామంలో 2001లో పుట్టాడు. సరబ్ తల్లిదండ్రులు జతీందర్ సింగ్, హర్దీప్ కౌర్. అతడి తండ్రి వ్యవసాయం చేసేవాడు. చిన్ననాటి నుంచి ఫుట్ బాలర్ కావాలని సరబ్ కలలు కనేవాడు. వయసు పెరుగుతున్న కొద్ది అతడి లక్ష్యాలు క్రమంగా మారాయి. 13 ఏళ్ల వయసులో ఓసారి సమ్మర్ క్యాంప్‌లో పిల్లలు పేపర్ టార్గెట్లను గురిపెట్టడం చూసి పిస్టల్ షూటింగ్ పై ఆసక్తి పెంచుకొన్నాడు. ఆ తర్వాత పిస్టల్ షూటింగ్‌పై దృష్టి పెట్టాడు. పిస్టల్ షూటింగ్ ఖరీదైన ఆట కావడం వల్ల సరబ్‌ను ప్రోత్సహించేందుకు అతడి తల్లిదండ్రులు ఆలోచించారు. కానీ, సరబ్ జోత్ వారికి నచ్చజెప్పాడు. దీంతో వారు కుమారుడి కోరికను, ఆసక్తిని వద్దనలేకపోయారు. తొలుత జిల్లా స్థాయిలో రజత పతకం సాధించడం వల్ల కుమారుడిలో ప్రతిభ ఉందని గుర్తించారు. ఈ విజయం సరబ్ జోత్ జీవితాన్ని మలుపు తిప్పింది. అభిషేక్ రాణా పర్యవేక్షణలో ప్రొఫెషనల్ కోచింగ్‌లో చేరాడు. చండీగఢ్ డీఏవీ కళాశాలలో సరబ్ జోత్ చదివాడు. అంబాలాలోని ఏఆర్ షూటింగ్ అకాడమీలో సరబజ్యోత్ శిక్షణ జరిగింది.
సరబజ్యోత్ రికార్డులు - 2019 జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణ పతకం సాధించాడు. అలాగే సీనియర్ ర్యాంకింగ్స్‌లోకి సరబ్ జోత్ అడుగుపెట్టాడు. ఇది సరబజ్యోత్ కెరీర్లో చాలా కీలకమైన అడుగు. అంతేకాకుండా వ్యక్తిగత విభాగం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకాలను సాధించాడు. అదే ఏడాది దోహాలో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్‌ను సాధించాడు. 2022లో జరిగిన 65వ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్లో రెండు స్వర్ణాలను సాధించాడు.
2023 ఆసియా ఛాంపియన్ షిప్స్‌లో కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్‌లో బెర్త్ ఖరారు చేసుకున్నాడు. తాజాగా మను బాకర్‌తో కలిసి దక్షిణ కొరియా జట్టును 16-10 తేడాతో ఓడించి భారత్‌కు పతకాన్ని అందించాడు.
“🇮🇳 What a day for India at #Paris2024! Manu Bhaker makes history with 2 bronze medals in women's 10m air pistol and 10m air pistol mixed team. Sarabjot Singh also shines bright! Proud of our shooting stars! 🇮🇳 #TeamIndia #cheer4Bharat.
— India in France (@IndiaembFrance) July 30, 2024
" 🇮🇳 quelle journée pour l'inde à… pic.twitter.com/KbKRbAU8hr
మను బాకర్‌కు అరుదైన గౌరవం - ఆ సింబల్‌కు అర్థం ఏంటంటే? - Manu Bhaker Eiffel Tower Badge