Paris Olympics 2024 July 27 schedule : పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆర్చరీ టీమ్ దూకుడుతో భారత జర్నీ ఘనంగా ప్రారంభమైంది(Para olympics Opening Ceremony). పురుషుల జట్టు, మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. అయితే ఒలింపిక్స్‌లో అసలు ఆట జూలై 27 నుంచి మొదలు కానుంది. నేడు మన భారత అథ్లెట్లు మొత్తం 7 క్రీడల్లో పాల్గొనున్నారు. దాదాపుగా అందరూ క్వాలిఫికేషన్ రౌండ్ లేదా స్టేజ్ రౌండ్‌లో పాల్గొననున్నారు. షూటింగ్ ఈవెంట్‌లో మాత్రం మెడల్ రౌండ్ కూడా జరగనుంది.
జులై 27 షెడ్యూల్ వివరాలు ఇవే!
బ్యాడ్మింటన్
- పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)
- మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
- పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)
- మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) - మధ్యాహ్నం 12 గంటల నుంచి
రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్ (బల్రాజ్ పన్వార్) - మధ్యాహ్నం 12:30 నుంచి
షూటింగ్
- 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ అర్హత (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా, ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్) - మధ్యాహ్నం 12:30 గంటలకు
- 10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్ (సరబ్‌జ్యోత్ సింగ్, అర్జున్ చీమా) - మధ్యాహ్నం 2 గంటలకు
- 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ రౌండ్‌లు - (Subject to qualification) మధ్యాహ్నం 2 గంటలకు.
- 10మీ ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ (రిథమ్ సాంగ్వాన్, మను బాకర్) - సాయంత్రం 4 గంటల నుంచి
Marvelling at the incredible beauty of the Olympic Rings on the Eiffel Tower. A sight that perfectly captures the grandeur of the event in front of us!
— Team India (@WeAreTeamIndia) July 25, 2024
As we approach the Opening Ceremony tomorrow, let us support our athletes loud and proud. #JeetKiAur | #Cheer4Bharat pic.twitter.com/j4lS3bzBWF
టెన్నిస్ : 1వ రౌండ్ మ్యాచ్‌లు పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్), పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలాజీ) - మధ్యాహ్నం 3:30 నుంచి
టేబుల్ టెన్నిస్ : పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) ప్రిలిమినరీ రౌండ్ - సాయంత్రం 6:30 నుంచి
బాక్సింగ్ : మహిళల 54 కేజీలు (ప్రీతీ పవార్) రౌండ్ ఆఫ్ 32 - సాయంత్రం 7 గంటల నుంచి
హాకీ : పురుషుల గ్రూప్ బి భారత్ v న్యూజిలాండ్ - రాత్రి 9 గంటలకు
ఎక్కడ చూడొచ్చంటే? - ఈ క్రీడలన్నింటినీ జియో సినిమా, స్పోర్ట్స్ 18లో క్రీడాభిమానులు ప్రత్యక్షప్రసారం ఫ్రీగా చూడొచ్చు.
చీరకట్టులో పీవీ సింధు - ఓపెనింగ్ సెర్మనీలో భారత అథ్లెట్లు ట్రెడిషనల్ వేర్ - Paris Olympics 2024