ETV Bharat / sports

ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌లో పోటీ  - ఆమె పోరాటానికి ప్రతిఒక్కరూ ఫిదా! - 2024 Paris Olympics - 2024 PARIS OLYMPICS

2024 PARIS OLYMPICS Fencer Nada Hafez : ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌ బరిలో నిలిచి అద్భుతంగా పోరాడిన ఫెన్సర్‌ను అందరూ అభినందిస్తున్నారు. క్రీడలపై ఆమెకున్న అంకిత భావాన్ని కొనియాడుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే?

source Associated Press
Egyptian fencer Nada Hafez (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 9:52 PM IST

2024 PARIS OLYMPICS Fencer Nada Hafez : ఇప్పటి వరకు అత్యంత చిన్న వయస్సు లేదా ఎక్కువ వయస్సు ఉన్న అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడం గురించి వినే ఉంటారు. ప్రస్తుత 2024 పారిస్‌ సమ్మర్‌ ఒలింపిక్స్‌లో అంతకన్నా భిన్నమైన దృశ్యం చోటు చేసుకుంది. ఏడు నెలల గర్భంతో ఉన్న తల్లి ఒలింపిక్‌ బరిలో దిగింది. మొదటి రౌండ్‌లో వరల్డ్‌ టాప్‌ టెన్‌ ర్యాంకర్‌పై అద్భుత విజయం కూడా సాధించింది. ఆమెనే ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్.

పారిస్ ఒలింపిక్స్‌లో తాను ఏడు నెలల గర్భంతో పోటీ పడ్డానని ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ వెల్లడించింది. ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై ఓపెనింగ్ మ్యాచ్‌లో 15-13 స్కోరుతో విజయం సాధించింది. అయితే హఫీజ్ తర్వాత రౌండ్ ఆఫ్ 16లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో 15-7 తేడాతో ఓడిపోయింది. కానీ బలమైన పోటీ ఇచ్చింది.

హఫీజ్ తన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్ల గురించి గర్విస్తూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ‘పోడియంపై మీకు ఇద్దరు ఆటగాళ్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి వారు ముగ్గురు! అది నేను, నా ప్రత్యర్థి, ఇంకా మా ప్రపంచంలోకి రాబోయే, నా లిటిల్‌ బేబీ! నా బిడ్డ, నేను ఫిజికల్‌, ఎమోషనల్‌ ఛాలెంజెస్‌ను కలిసి ఎదుర్కొన్నాం.’ అని తెలిపింది.

  • సులువుగా లొంగిపోలేదు!
    గర్భంతో ఉన్నప్పుడు మహిళలు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతారు. అలాంటిది తీవ్ర పోటీ ఉండే ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధారణం. హఫీజ్ ఫెన్సింగ్‌పై చూపిన డెడికేషన్‌, ప్యాషన్‌కు గ్లోబల్‌ అథ్లెటిక్ కమ్యూనిటీ నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

‘గర్భంతో ఉన్నప్పుడు సాధారణంగా కొన్ని సవాళ్లు ఉంటాయి. కానీ జీవితాన్ని, క్రీడలను బ్యాలెన్స్‌ చేయడానికి ప్రయత్నించడం మరింత సవాలుగా మారింది. అయితే, అదంతా విలువైనదే. 16వ రౌండ్‌లో చోటు సంపాదించినందుకు చాలా గర్వంగా ఉంది’ అని హఫీజ్ తెలిపింది.

  • ఫ్యామిలీ సపోర్ట్‌ లభించడం అదృష్టం!
    పారిస్ ఒలింపిక్స్‌లో తన స్ఫూర్తిదాయక ప్రయాణంలో తన భర్త అందించిన సపోర్ట్‌ గురించి హఫీజ్‌ ప్రస్తావించింది. ‘ఇంత దూరం రావడానికి నా భర్త, నా కుటుంబం సపోర్ట్‌ లభించినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ ఒలింపిక్స్ నాకు భిన్నంగా ఉంది. ఇది నాకు మూడో ఒలింపిక్స్‌. కానీ ఈసారి నేను ఒక చిన్న ఒలింపియన్‌ను కూడా తీసుకువెళ్లాను!’ అని పేర్కొంది. కాగా, హఫీజ్ గతంలో 2016 రియో ​​ఒలింపిక్స్, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో ఈజిప్ట్‌కు ప్రాతినిధ్యం వహించింది.

ఒలింపిక్స్​లో మను బాకర్​ విజయాల వెనక రానా - Paris Olympics 2024

ఐర్లాండ్​పై భారత హాకీటీమ్​ విజయం - బ్యాడ్మింటన్​లో క్వార్టర్‌ ఫైనల్​కు సాత్విక్​, చిరాగ్​ - Paris 2024 Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.