Paris olympics 2024 Vinesh Phogats appeal : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఈ సారి ఎలాగైనా పతకం సాధించాలని పట్టుదలతో మంచి ప్రదర్శన చేస్తూ దూసుకెళ్లింది. దిగ్గజ రెజ్లర్ యుయి సుసాకినిపై విజయం సాధించడంతో సంచలనం సృష్టించిన వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. కానీ చివరికి నిరాశే ఎదురైంది. ఫైనల్ ముందు అనూహ్యంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు నిర్వాహకులు. 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో బరిలో దిగిన ఆమె కేవలం 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో డిస్ క్వాలిఫై చేశారు.
దీంతో ఆమె తన అనర్హత వేటును సవాల్ చేస్తూ, కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (CAS)ను సంప్రదించింది. కనీసం తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ అప్పీల్‌ను పరిగణలోకి తీసుకున్న కాస్ వాదనలు విని విచారించింది. అయితే తీర్పును వాయిదాలు వేస్తూ చివరికి ఈ నెల 14న అప్పీల్‌ను కొట్టి పారేస్తున్నట్లు వెల్లడించింది. వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఏకవాక్యంలో తీర్పు నిచ్చింది.
Vinesh Phogat Disqualification : అయితే తాజాగా వినేశ్ ఫొగాట్ అప్పీల్‌ను ఎందుకు కొట్టివేసిందో, అందుకుగల కారణాలను వివరించింది కాస్. ఈ మేరకు 24 పేజీల రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆర్టికల్ 11 ప్రకారం తమ బరువు పరిమితిలోపు ఉండే బాధ్యత అథ్లెట్లదేనని, నిబంధనల ప్రకారమే వినేశ్ ఫొగాట్‌ను డిస్ క్వాలిఫై చేసినట్లు స్పష్టం చేసింది. బరువు విషయంలోఎవరైనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని, ఏ రెజ్లర్‌కు అయినా మినహాయింపు ఉండదని కాస్ పేర్కొంది.
"క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. రూల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. వెయిట్ విషయంలో రూల్స్ అందరికీ ఒకటే. ఎవరికైనా మినహాయింపు ఉండదు. బరువు పరిమితి లోపు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అథ్లెట్‌దే. నిర్ణీత బరువు కన్నా ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే. " అని చెప్పుకొచ్చింది.
వినేశ్ ఫొగాట్‌కు అస్వస్థత - కుర్చీలోనే వెనక్కి పడిపోయి! - వీడియో వైరల్ - Paris olympics 2024 Vinesh Phogat
'ఆ రోజు వినేశ్ ఫొగాట్ చనిపోతుందని అనుకున్నా!'- కోచ్ సంచలన వ్యాఖ్యలు - Vinesh Phogat Olympics