ETV Bharat / sports

పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు ఔట్​ - ప్రీ క్వార్టర్స్​లో ఓటమి - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics Live
Paris Olympics Live (Source: ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 1, 2024, 9:34 AM IST

Updated : Aug 1, 2024, 11:32 PM IST

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024​లో గురువారం భారత్​ ఖాతాలో మరో పతకం చేరే ఛాన్స్ ఉంది. పురుషుల షూటింగ్ 50మీటర్ల రైఫిల్ 3పొజిషన్ ఈవెంట్​ ఫైనల్లో స్వప్నిల్ కుసాలే పోటీపడనున్నాడు. ఈ పోరులో టాప్- 3లో నిలిస్తే స్వప్నిల్​కు పతకం గ్యారెంటీ. ఇక స్వప్నిల్​తో పాటు పలువురు భారత అథ్లెట్లు గురువారం ఆయా ఈవెంట్​లలో పాల్గొననున్నారు. ఆ క్రీడాంశాల లైవ్ అప్డేట్స్ మీ కోసం.

LIVE FEED

11:02 PM, 1 Aug 2024 (IST)

పీవీ సింధుకు నిరాశ

ParisOlympics PVSindhu : ఒలింపిక్స్‌లో మూడో పతకంపై కన్నేసిన స్టార్‌ షట్లర్ పీవీసింధుకు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్​లో గ్రూప్​స్టేజ్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన సింధుకు ఇప్పుడు ప్రీ క్వార్టర్స్​లో పరాజయం ఎదురవ్వడంతో.ఆమె పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్‌ 2016లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌ 2020లో కాంస్యం గెలిచిన సింధు - ఇప్పుడు పారిస్​లో మాత్రం ప్రీక్వార్టర్స్‌కే పరిమితమైంది. చైనాకు చెందిన 9వ ర్యాంకర్ హీబింగ్ జియావోపై 19-21,14-21వరుస సెట్లలో ఓడింది. వాస్తవానికి ఈ పోరులో సింధుఅనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలిగేమ్‌లో క్రాస్ కోర్ట్ షాట్స్‌తో సింధు, స్మాష్‌లతో చైనా ప్లేయర్ హోరాహోరీగా తలపడ్డారు. చివరకు చైనా ప్లేయర్ గెలిచింది. ఇక రెండోగేమ్ ఆరంభం నుంచే దూకుడు చూపించిన బింగ్​ వరుస పాయింట్స్‌తో సింధుపై ఒత్తిడిని పెంచింది. కానీ మధ్యలో సింధు కాస్త పుంజుకున్నా చివరికి ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతంచేసుకుంది బింగ్​.

6:38 PM, 1 Aug 2024 (IST)

క్వార్టర్​ ఫైనల్స్​కు లక్ష్య సేన్​

22 ఏళ్ల లక్ష్య సేన్​ కార్వర్ ఫైనల్స్​కు అర్హత సాధించాడు. మెన్స్ సింగిల్స్ ఈవెంట్​లో స్టైట్​ గేమ్స్​లో హెస్​ ఎస్ ప్రణయ్​ను ఓడించాడు. 39 నిమిషాల పాటు సాగిన గేమ్​లో 21-12, 21-6 తేడాతో ఓడించాడు.

5:42 PM, 1 Aug 2024 (IST)

సాత్విక్​-చిరాగ్​కు నిరాశ

బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్​ ఈవెంట్​లో సాత్విక్​రాజ్​ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి నిరాశ ఎదురైంది. క్వార్టర్​ ఫైనల్స్​లో 21-13, 14-21, 16-21 తేడాతో మలేషియా ద్వయం ఆరోన్ - వూ ఇక్​పై ఓడిపోయింది. తర్వాత రౌండ్​లో ఈ మలేషియా ద్వయం చైనాకు చెందిన లియాంగ్ - వాంగ్ చాంగ్​తో తలపడనుంది.

5:20 PM, 1 Aug 2024 (IST)

  • మహిళల 50మీటర్లు రైఫిల్ 3పొజిషన్​లో భారత్​కు నిరాశ
  • క్వాలిఫయర్ రౌండ్​లో నిరశ పర్చిన అంజుమ్, సిఫ్ట్ కౌర్ శర్మ
  • 584-26xపాయింట్లతో 18వ స్థానంలో నిలిచిన అంజుమ్
  • 575-22x పాయింట్లతో 31వ స్థానానికి పరిమితమైన సిఫ్ట్ కౌర్
  • ఈ ఈవెంట్​లో టాప్ -8 షూటర్లు ఫైనల్​కు అర్హత సాధిస్తారు

5:12 PM, 1 Aug 2024 (IST)

  • రెండో సెట్లో డీలా పడ్డ సాత్విక్- చిరాగ్ జోడీ
  • 14-21తో రెండో సెట్ దక్కించకున్న మలేసియా ద్వయం
  • రెండు సెట్లు ముగిసేసరికి స్కోర్ 1- 1
  • ఫలితం తేల్చనున్న మూడో సెట్

4:54 PM, 1 Aug 2024 (IST)

  • 20కిమీ రేస్ వాక్​ పూర్తి చేసిన ప్రియాంకా గోస్వామి
  • 1:39.55 సమయంలో వాక్ పూర్తి చేసిన ప్రియాంక
  • 41వ స్థానం దక్కించుకున్న ప్రియాంక

4:52 PM, 1 Aug 2024 (IST)

  • బ్యాడ్మింటన్ డబుల్స్​లో సాత్విక్- చిరాగ్ శెట్టి జోడీ జోరు
  • క్వార్టర్స్​లో ఆరోన్- వూ ఇక్ (మలేసియా)పై 21-13తో తొలి సెట్ విన్

3:04 PM, 1 Aug 2024 (IST)

  • పురుషుల హాకీలో టీమ్ఇండియాకు నిరాశ
  • క్వార్టర్స్​లో బెల్జియంపై 1-2 తేడాతో భారత్ ఓటమి
  • రేపు ఆస్ట్రేలియాతో తలపడనున్నా భారత్

2:53 PM, 1 Aug 2024 (IST)

  • ఆర్చరీ సింగిల్స్​ గ్రూప్ స్టేజ్​లో ప్రవీణ్ ఓటమి
  • రౌండ్ 64లో వెచాఓ (చైనా)పై ఓడిన ప్రవీణ్

2:49 PM, 1 Aug 2024 (IST)

  • బాక్సింగ్‌ 50 కేజీల ప్రిక్వార్టర్స్‌లో నిఖత్‌ జరీన్‌ ఓటమి
  • వరల్డ్​ నెం.1 సీడ్ యూ వు (చైనా)పై 0-5 తేడాతో ఓటమి

2:23 PM, 1 Aug 2024 (IST)

  • హాకీ క్వార్ట్​ర్స్​లో లీడ్​లో టీమ్ఇండియా
  • హాఫ్ టైమ్ ముగిసేసరికి 1-0తో లీడ్​లో భారత్
  • టీమ్ఇండియా 1- 0 బెల్జియం

1:50 PM, 1 Aug 2024 (IST)

  • భారత్ ఖాతాలో మూడో పతకం
  • 50మీటర్ల రైఫిల్ ఈవెంట్​లో కాంస్యం నెగ్గిన స్వప్నిల్
  • 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన స్వప్నిల్

1:11 PM, 1 Aug 2024 (IST)

పారిస్ ఒలింపిక్స్ పురుషుల 20కి.మీ రేస్ వాక్ ఈవెంట్‌లో భారత్​కు చెందిన వికాశ్​ సింగ్, పరమజీత్ సింగ్ బిష్త్ వరుసగా 30, 37 స్థానాల్లో నిలిచారు.

12:23 PM, 1 Aug 2024 (IST)

  • 20కిమీల రేస్​ వాక్​లో నిరాశ పర్చిన అక్షదీప్ సింగ్​
  • ఫైనల్​​​లో 7కిమీల వద్ద పోటీ నుంచి తప్పుకున్న అక్షదీప్

9:27 AM, 1 Aug 2024 (IST)

  • టేబుల్ టెన్నిస్​ ప్రీ క్వార్టర్స్​లో ఆకుల శ్రీజకు నిరాశ
  • వరల్డ్​ నెం.1 సున్ (చైనా)తో 4-0 తేడాతో ఓటమి

9:26 AM, 1 Aug 2024 (IST)

  • పురుషుల బాక్సింగ్​లో నిషాంత్ దేవ్ విజయం
  • క్వాలిఫయర్​​ 71కేజీల ఈవెంట్​లో నిషాంత్ విక్టరీ
  • ఈ విజయంతో క్వార్టర్స్​కు దూసుకెళ్లిన నిషాంత్

9:23 AM, 1 Aug 2024 (IST)

  • పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​లో హెచ్ ఎస్ ప్రణయ్ ​జోరు
  • రౌండ్ 16కు అర్హత సాధించిన ప్రణయ్
  • రౌండ్ 16లో లక్ష్యసేన్​తో తలపడనున్న ప్రణయ్

Last Updated : Aug 1, 2024, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.