Paralympic Red Cap: పారిస్ నగరంలో పారాలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ విశ్వక్రీడల్లో గెలిచిన అథ్లెట్లకు పతకంతో పాటు మస్కట్ (Mascot)గా ఫ్రీజ్ అందిస్తున్నారు. ఫ్రీజ్ అంటే ఎరుపు రంగు టోపీ బొమ్మ. ఎందుకు ఈ ఫ్రీజ్ను పతక విజేతలకు అందిస్తున్నారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్వేచ్ఛ, స్వతంత్ర స్ఫూర్తికి చిహ్నంగా
ఈ రకమైన ఎరుపు టోపీ (ఫ్రీజ్) ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఉపయోగించేవారు. అది స్వేచ్ఛ, స్వతంత్ర స్ఫూర్తికి సూచికంగా వాడుతున్నారు. అథ్లెట్లు సాధించిన పతకం బట్టి, వాళ్లకు ఇచ్చే బొమ్మపైలోగో, షూ (Shoe) కలర్ మారుతుంది. పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ విజేతలకు ఇచ్చే ఫ్రీజియన్ క్యాప్‌లు ఒకేలా కనిపిస్తాయి. అయితే అవి కాస్త భిన్నంగా ఉంటాయి.
పారాలింపిక్స్‌లో గెలిచిన విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ఇస్తారు. ఆ తర్వాత పోస్టర్‌ను అందిస్తారు. అలాగే పతకాల విజేతలకు ఫ్రీజ్ అనే మస్కట్ ఇస్తారు. దీన్ని ఫ్రాన్స్ లోని లా గుర్చే-డి-బ్రెటాగ్నేలోని డౌడౌ అండ్ కంపెనీ ఫ్యాక్టరీ లో తయారుచేస్తారు. ఈ మస్కట్ మధ్యలో పతక చిహ్నం, ట్రైనర్ కలర్ ఉంటుంది. ఈ ఫ్రీజ్ వెనుక భాగంలో 'బ్రావో' అని బ్రెయిలీలో రాసి ఉంటుంది.
ఫ్రెంచ్ సంప్రదాయం
ఫ్రెంచ్ సంప్రదాయంలో ఫ్రీజియన్ క్యాప్ ఎంతో ముఖ్యమైనది. దీని ఆధారంగానే ఫ్రీజ్ మస్కట్‌ను రూపొందించారు. ఫ్రాన్స్ చరిత్రలో ఇదో కీలక భాగం. అలానే ఆటల్లోని సమష్టితత్వాన్ని తెలియజేస్తూ దీనిని తయారుచేశారు. 1798-1799 మధ్య ఫ్రెంచి విప్లవం జరిగింది. అప్పుడు స్వేచ్ఛకు చిహ్నంగా ఫ్రీజియన్ క్యాప్‌లను ఉపయోగించేవారు. అలా ఇవి చరిత్రలో స్థానం దక్కించుకొన్నాయి.
భారత అథ్లెట్లు అదుర్స్
ఆగస్టు 28న ప్రారంభమైన పారిస్ పారాలింపిక్స్ గేమ్స్ సెప్టెంబరు 8తో ముగియనున్నాయి. ఈ విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. మొత్తం 25 పతకాలు దేశానికి అందించారు. అందులో 5 గోల్ట్ ఉండగా, 9 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
మెడల్ @ 25: చరిత్ర సృష్టించిన కపిల్- జూడోలో భారత్‌కు తొలి పతకం - 2024 Paralympics
పారాా అథ్లెట్ల అద్భుత పెర్ఫామెన్స్ - 20కి చేరిన పతకాల సంఖ్య - Paralympics 2024