Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ బోణి కొట్టింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్‌కు చెందిన క్రిస్టీనాను చిత్తు చేసింది. 30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో శ్రీజ పూర్తి ఆధిపత్యం చలాయించింది. 4-0 తో క్రిస్టీనాను తెలుగు తేజం శ్రీజ చిత్తు చేసింది. 32వ రౌండ్‌లో అకుల శ్రీజ జియాన్ జెంగ్ లేదా ఇవానా మలోబాబిక్ తో తలపడనుంది. తొలిసారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఆకుల శ్రీజ ఈ సారి దేశానికి ఎలాగైనా పతకాన్ని తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోంది.
Top-ranked Indian paddler Sreeja Akula stands tall to clinch a superb 11-4 11-7 11-9 11-8 victory over Sweden's Christina Kallberg in the women's singles round of 64. pic.twitter.com/jRe3HxGHG6
— SAI Media (@Media_SAI) July 28, 2024
ఇక భారత షూటర్ రమితా జిందాల్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. 631.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. మరోవైపు, 110 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ మరో భారత షూటర్ ఎలవెనిల్ మెడల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫైయర్ రౌండ్ ఆసాంతం రమితా జిందాల్ కంటే ముందంజలో ఉన్న ఎలావెనిల్ ఆఖరి షాట్స్‌లో తడబడి ఫైనల్ అవకాశాలను చేజార్చుకుంది.
మెుదటి సిరీస్‌లో రమితా జిందాల్ 104.3 పాయింట్లు సాధించి 22వ స్థానంలో నిలిచింది. అదే సిరీస్ లో ఎలవెనిల్ 105.8 పాయింట్ల కొల్లగొట్టి నాలుగో ర్యాంకును సంపాదించింది. రమిత రెండో సిరీస్‌లో 106 పాయింట్లు సాధించి తిరిగి పుంజుకుంది. రెండు సిరీస్ లు కలిపి 210 పాయింట్లకు చేరడం వల్ల ఎనిమిదో స్థానానికి చేరుకుంది. రెండో సిరీస్‌లో ఎలవెనిల్ 106.1 పాయింట్లు సాధించింది. ఆ తర్వాత 3,4,5,6 సిరీస్ ల్లో రమిత వరుసగా 104.9, 105.3, 105.3, 105.7 పాయింట్లు రాబట్టింది. దీంతో ఒక్కసారిగా ఫైనల్ కు దూసుకెళ్లింది. మొత్తం ఆరు సిరీస్ ల్లో కలిపి రమిత జిందాల్ 631.5 పాయింట్లు సాధించింది.
10 M AIR RIFLE WOMEN’S QUALIFICATION ROUND Results👇🏻
— SAI Media (@Media_SAI) July 28, 2024
Ramita Jindal shoots her way into the final with a score of 631.5, finishing 5th
Elavenil Valarivan finishes 10th with a score of 630.7
The top 8 progressed to the finals.
Let’s #Cheer4Bharat🥳 pic.twitter.com/OsNEGpdbBF
మనూ బాకర్ అదరహో- భారత్ ఖాతాలో తొలి పతకం - Paris Olympics 2024
పీవీ సింధు బోణీ- మాల్దీవులు ప్లేయర్‌పై ఈజీ విన్ - PV Sindhu Paris Olympics 2024