ETV Bharat / sports

మెడల్ @ 25: చరిత్ర సృష్టించిన కపిల్- జూడోలో భారత్​కు తొలి పతకం - 2024 Paralympics - 2024 PARALYMPICS

Paralympics India 2024: పారిస్ పారాలింపిక్స్​లో భారత్ ఖాతాలో 25వ పతకం చేరింది. పారాలింపిక్స్​లో చరిత్రలో గురువారం భారత్ పురుషుల జూడోలో తొలి పతకం నెగ్గింది.

Paralympics India 2024
Paralympics India 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 6, 2024, 6:37 AM IST

Paralympics India 2024: పారిస్ పారాలింపిక్స్​లో భారత్ ఖాతాలో 25వ పతకం చేరింది. పారాలింపిక్స్​లో చరిత్రలో పురుషుల జూడోలో భారత్ తొలి పతకం నెగ్గింది. గురువారం జరిగిన పురుషుల 60 కేజీల జే1 విభాగంలో భారత పారా అథ్లెట్ కపిల్ పార్మర్ అద్భుత ప్రదర్శనతో కాంస్యం దక్కించుకున్నాడు. బ్రాంజ్ మెడల్ ఈవెంట్​లో కపిల్ కేవలం 33 సెకన్లలోనే ప్రత్యర్థి డి ఒలివెరా (బ్రెజిల్) పనిపట్టాడు. ఇప్పాన్‌ (ప్రత్యర్థి వీపు మ్యాట్‌కు తగిలేలా పడేసి)తో అతడు విజేతగా నిలిచి భారత్ తరఫున జూజోలో పతకం నెగ్గిన తొలి అథ్లెట్​గా చరిత్ర సృష్టించాడు.

కోమాను దాటి పోడియంపై
24 ఏళ్ల కపిల్‌ పార్మర్​కు కంటి చూపు అతి స్వల్ప దృష్టి మాత్రమే. అతడు చిన్నప్పటి నుంచి హుషారుగా ఉండేవాడు. అన్నదమ్ముల్లతో కలిసి చురుగ్గా ఆటలాడేవాడు. జూడో సాధన చేసే అన్నయ్యతో కలిసి తాను కూడా మెళకువలు నేర్చుకున్నాడు. ఇదే ఆటలో ఛాంపియన్‌గా ఎదగాలనుకున్నాడు. కానీ, 9 ఏళ్ల వయసులో పొలాల్లో ఆడుకుంటూ వెళ్లి నీటి పంపును పట్టుకున్నాడు. అంతే ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌తో ఎగిరిపడ్డాడు. స్పృహ కోల్పోయిన అతడిని గ్రామస్థులు గుర్తించి ఆసుపత్రిలో చేర్చారు. కపిల్‌ కోమాలోకి వెళ్లిపోయాడు. ఆరు నెలల తర్వాత అతడికి మెళుకువ వచ్చింది. కానీ కళ్లు తెరిస్తే చీకటే. ఆ ప్రమాదంతో అతను చూపు కోల్పోయాడు. అతి స్వల్ప దృష్టి మాత్రమే మిగిలింది.

అయినప్పటికీ కుంగిపోకుండా పోరాటాన్ని ఎంచుకున్నాడు. సంకల్పంతో జూడో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. 2018 నేషనల్ ఛాంపియన్​షిప్​లో విజేతగా నిలిచిన కపిల్, 2019 కామన్వెల్త్ ఛాంపియన్​షిప్స్​లో స్వర్ణం నెగ్గాడు. గతేడాది జూడో గ్రాండ్‌ప్రిలో స్వర్ణం, IBSA ప్రపంచ క్రీడల్లో కాంస్యం, ఆసియా పారా క్రీడల్లో సిల్వర్​తో మెరిశాడు. తాజాగా పారిస్ పారాలింపిక్స్​లో కాంస్యంతో మెరిశాడు. అయితే పారాలింపిక్స్‌ అంధుల జూడోలో క్రీడాకారులిద్దరూ సహాయక సిబ్బంది సాయంతో మ్యాట్‌పైకి వస్తారు. ఈ ప్రత్యర్థులు ఒకరినొకరు పట్టుకునేలా రిఫరీ సాయం చేస్తాడు. ఆ తర్వాత వీళ్లు తలపడతారు.

  • పారాలింపిక్స్​లో ఇప్పటివరకు భారత్ పతకాలు
స్వర్ణంరజతంకాంస్యంమొత్తం
05091125

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.