Paralympics 2024 September 4 Medal Tally : పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో మన పారా అథ్లెట్లు అంచనాలను మించిపోయారు. కేవలం 5 రోజుల వ్యవధిలోనే 5 స్వర్ణాలు సహా భారత్ ఖాతాలో ఏకంగా 24 పతకాలు సాధించిపెట్టారు. బుధవారం జరిగిన వివిధ ఈవెంట్స్‌లో సత్తాచాటి అందరినీ అబ్బురపరిచారు.
షాట్‌పుటర్ ప్లేయర్ సచిన్ ఖిలారి భారత్‌కు 21 పతకాన్ని అందిస్తే, హర్విందర్ 22వ పతకాన్ని సాధించి పెట్టాడు. షాట్‌పుట్ ఎఫ్-46 విభాగంలో ఆడిన ఈ ప్రపంచ ఛాంపియన్, గుండును 16.32 మీటర్ల దూరానికి విసిరి రజత పతకాన్ని ముద్దాడాడు.
ఈ ఏడాది జపాన్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో 16.30 మీటర్లతో ఆసియా రికార్డు నెలకొల్పి ఛాంపియన్‌గా నిలిచాడు. ఇప్పుడు అంతకంటే మెరుగ్గా పెర్ఫార్మ్ చేసినప్పటికీ రజతమే దక్కింది. "నేను స్వర్ణానికి గురిపెట్టాను. కానీ అది జరగలేదు. నేను బెస్ట్‌గా ఆడినప్పటికీ సంతృప్తిగా లేను. ఇంకా మెరుగ్గా విసరాల్సింది" అంటూ సచిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు కలిపి మొత్తంగా 24 పతకాలు సాధించి పట్టికలో 13వ స్థానంలో ఉంది.
అయితే షూటింగ్ 50 మీటర్ల పిస్టల్ SH-1 విభాగంలో పతకాలు సాధిస్తారని భారీ అంచనాలు పెట్టుకున్న నిహాల్ సింగ్, రుద్రాంశ్‌లకు నిరాశ తప్పలేదు. వీళ్లిద్దరూ అర్హత రౌండ్లలో విఫలమయ్యారు. 522 స్కోర్‌తో నిహాల్ 19వ స్థానంలో పరిమితమవ్వగా, 517 స్కోర్‌తో రుద్రాంశ్ 22వ స్థానంలో నిలిచాడు. ఇక సైక్లింగ్‌లో అర్షద్ షేక్ 11వ, జ్యోతి గదారియా 16వ స్థానానికి పరిమితమయ్యారు.
ఇదిలా ఉండగా, 2020 పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా బెన్ పటేల్ ఈ సారి నిరాశపరిచింది. మహిళల క్లాస్-4 క్వార్టర్ ఫైనల్లో 1-3తో చైనాకు చెందిన యింగ్ జౌ చేతిలో పరాజయం పాలైంది.
His arrow has hit GOLD!
— Kiren Rijiju (@KirenRijiju) September 4, 2024
Harvinder Singh has unleashed the true power of precision with his golden triumph in the Para Archery Men’s Individual Recurve Open at #Paralympics2024!
With every shot, he’s demonstrated that extraordinary skill & relentless determination can conquer… pic.twitter.com/B6jHYMpDK3
పారాలింపిక్స్‌లో సెప్టెంబర్ 5 ఈవెంట్స్
షూటింగ్: మిక్స్‌డ్ 50మీ.రైఫిల్ ప్రోన్ SH1 క్వాలిఫికేషన్ (సిద్ధార్థ, మోనా)- మధ్యాహ్నం 1, ఫైనల్- మధ్యాహ్నం 3.15
పారా ఆర్చరీ: మిక్స్‌డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ ప్రిక్వార్టర్స్ (పూజ-హర్విందర్)- మధ్యాహ్నం 1.50, పతక రౌండ్లు- రాత్రి 8.45 నుంచి
పారా జూడో: మహిళల 48 కేజీ J2 క్వార్టర్స్ (కోకిల×నాట్బెక్); పురుషుల 60 కేజీ జే1 క్వార్టర్స్ (కపిల్×బ్లాంకో)- మ।। 1.30 నుంచి
పారా పవర్‌లిఫ్టింగ్: పురుషుల 65 కేజీల ఫైనల్ (అశోక్)- రాత్రి 10.05