Pakisthan Star Allrounder Imad Wasim Retirement : పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అంతర్జాతయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు. సోషల్‌మీడియా వేదికగా తన రిటైర్మెంట్ గురించి తెలిపాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని సందేశంలో పేర్కొన్నాడు.
"దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. పాకిస్థాన్‌కు ఆడుతున్న ప్రతి క్షణం మరచిపోలేనిది. అభిమానుల ప్రేమ, వారి మద్దతుకు నా ధన్యవాదాలు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆటను కొనసాగిస్తాను." అని వెల్లడించాడు.
కాగా, 35 ఏళ్ల ఇమాద్ వసీం 2015లో పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టీ20 స్పెషలిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. 2019లో పాక్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెరీర్లో మొత్తంగా పాకిస్థాన్ తరఫున 55 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. వన్డేల్లో 986 పరుగులు, 44 వికెట్లు, టీ20ల్లో 554 పరుగులు, 73 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇమాద్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 2024 టీ20 వరల్డ్‌కప్ కోసం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇకపోతే వరల్డ్ వైడ్‌గా ఉన్న వివిధ ఫ్రాంచైజీలకు ఇమాద్ వసీం అడుతున్న సంగతి తెలిసిందే.
పెరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ నెట్‌వర్త్ - ఇప్పుడు అతడి ఆదాయం ఎన్ని కోట్లంటే?
ఇప్పుడు కూడా అదే ఆలోచనతో బరిలోకి దిగుతాం - మాకేం ఆందోళన లేదు! : గిల్