WTC Points Table Pakisthan : స్వదేశంలోనే ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ ముందు వరకు 19.05 శాతంతో ఎనిమిదో ప్లేస్ లో ఉన్న పాకిస్థాన్, తాజాగా సవరించిన గణాంకాల ప్రకారం 16.67 శాతంతో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్
పాకిస్థాన్ ను తొలి టెస్టులో ఓడించిన ఇంగ్లండ్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పెద్ద మార్పు ఏమీ రాలేదు. గతంలో ఉన్న నాలుగో ప్లేస్ లో నిలిచింది. అయితే, పర్సంటేజీని 42.19 నుంచి 45.59 వరకు పెంచుకోగలిగింది ఇంగ్లండ్ జట్టు.
ఘోరంగా విఫలమైన పాకిస్థాన్
డబ్ల్యూటీసీ 2023-25 సీజన్ లో పాక్ జట్టు మొత్తం 8 టెస్టులు ఆడగా, అందులో కేవలం రెండింట్లోనే గెలిచింది. మిగతా ఆరు టెస్టుల్లో ఓటమిపాలైంది. మరోవైపు, ఇంగ్లండ్ అన్ని జట్ల కంటే ఎక్కువగా 17 టెస్టులు ఆడగా, తొమ్మిందిట్లో విజయం సాధించింది. మరో 7 మ్యాచ్ ల్లో ఓడగా, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. బజ్‌బాల్ క్రికెట్‌తో ఫలితం తేలడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ జట్టు ఆటలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో వరుసగా మ్యాచుల్లో గెలుస్తూ వస్తోన్న ఇంగ్లండ్, ఫైనల్‌కు చేరాలంటే మిగతా నాలుగు మ్యాచుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. అప్పుడు ఇతర జట్ల సమీకరణాలనుబట్టి ఇంగ్లండ్ జట్టు టాప్-2లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పాక్‌తో ఇంకొక టెస్టు, ఆ తర్వాత కివీస్ తో మూడు టెస్టుల సిరీస్ లో తలపడనుంది.
WTC Points Table TeamIndia : టాప్‌లో భారత్ - ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 11 మ్యాచ్ ల్లో 8 విజయాలు, 2 ఓటములతో 74.24 విన్నింగ్ పర్సంట్ తో దూసుకెళ్తోంది. రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, పాకిస్థాన్ నిలిచాయి.
సునాయాశంగా ఫైనల్‌కు భారత్!
మరోవైపు, భారత్ కు 8 మ్యాచుల్లో 3, ఆసీస్‌కు ఏడు మ్యాచుల్లో 4 విజయం సాధిస్తే చాలు రెండు జట్లు మరోసారి సునాయాశంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుతాయి. వచ్చే ఏడాది మార్చి - ఏప్రిల్ నాటికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్నాయి.
రోహిత్‌కు అది దేవుడిచ్చిన ఓ గొప్ప బహుమతి : ధోనీ
తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ విజయం- పాక్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు