Pakisthan Declared Match : ఐదు రోజుల పాటు సాగే టెస్టు క్రికెట్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్టు మెరుగైన స్థితిలో ఉన్నప్పుడు డిక్లేర్డ్ నిర్ణయాలను ప్రకటించడం చూస్తుంటాం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందనుకుంటే ఆయా జట్ల కెప్టెన్లు ఈ నిర్ణయాన్ని తీసుకుంటుంటారు. అయితే ఒక్కోసారి ఇది బోల్తా కొట్టే అవకాశం ఉంటుంది.
తాజాగా ఇలాంటి పరిస్థితే పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కు ఎదురైంది. బంగ్లాతో(Pakisthan VS Bangladesh) జరిగిన తొలి టెస్టులో పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే ఇలా మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసి ఓటమి పాలవ్వడం పాకిస్తాన్‌కు కొత్తేమీ కాదు. అంతకుముందు ఇలానే జరిగిన సందర్భాలు ఉన్నాయి.
ఎప్పుడెప్పుడు ఇలా జరిగిందంటే? - మొదటి ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్డ్ చేసి పరాజయం పొందటం పాకిస్థాన్ జట్టుకు ఇది మూడో సారి కావడం గమనార్హం. రెండో సారి బ్యాటింగ్ చేసిన సమయంలోనూ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చాక ఒకసారి పాకిస్థాన్ ఓటమిని అందుకుంది. 1972లో ఇది జరిగింది. ఆస్ట్రేలియాపై రెండో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 574/8 స్కోరు సాధించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్గా ప్రకటించింది. అయినా ఓటమిని అందుకుంది.
1961లో లాహోర్ వేదికగా జరిగిన పాకిస్థాన్ - ఇంగ్లాండ్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పా 9 వికెట్ల నష్టానికి 387 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 380 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 200 రన్స్ చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 209/5 స్కోరు సాధించి గెలుపొందింది.
2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 443/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో 624/8 స్కోరు చేశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 163 పరుగులకే ఆలౌట్ అయింది. అలా ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇక తాజాగా బంగ్లాదేశ్ చేతిలోనూ పాకిస్థాన్ ఇలాంటి ఓటమినే అందుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 448/6 స్కోరు దగ్గర ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. అయితే అప్పటికే క్రీజులో బ్యాటర్ రిజ్వాన్ (171*) కొనసాగుతు్ననాడు. కానీ, బంగ్లాదేశ్‌ను త్వరగా ఆలౌట్ చేయాలనే ఆలోచనతో పాకిస్థాన్ కెప్టెన్ డిక్లేర్డ్ ప్రకటించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ (191) సూపర్ ఇన్నింగ్స్‌తో తన టీమ్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్‌పై ఫుల్ ట్రోలింగ్ జరుగుతోంది.
మొత్తం ఎన్ని సార్లంటే? - తమ మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసి ఆ తర్వాత ఓటమిని అందుకున్న జట్లు చాలానే ఉన్నాయి. మొత్తం 17 మ్యాచుల్లో ఆయా జట్లన్నీ పరాజయాన్ని అందుకున్నాయి. పాకిస్థాన్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మాత్రం చెరో మూడేసి మ్యాచుల్లో ఓడి సమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా 2, వెస్టిండీస్ 2, బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ఒక్కో మ్యాచ్‌లో పరాజయాన్ని అందుకున్నాయి. భారత్ కూడా ఒక మ్యాచ్‌లో ఇలాంటి ఓటమినే అందుకుంది. 1976లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఫలితాన్ని చవి చూసింది.
పెళ్లి గురించి ప్రశ్న - సిగ్గుపడుతూ మను బాకర్ ఏం చెప్పిందంటే? - Manu Bhaker Marriage